లెక్కప్రకారం ఉగాదికే ఆచార్య టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆరోజు చిరంజీవి సోషల్ మీడియాలోకి రావడం… ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ పెట్టుకోవడంతో.. అనివార్యంగా ఆచార్య లోగో రిలీజ్ కార్యక్రమం పోస్ట్ పోన్ అయింది. అలా వాయిదా పడిన ఆచార్య ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమానికి మరో తేదీ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ శ్రీరామనవమికి (ఏప్రిల్ 2) ఆచార్య లోగో డిజైన్ తో పాటు, చిరు ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మేరకు “మెగా” సోషల్ మీడియా గ్రూపుల్లో ఆల్రెడీ సమాచారం సర్కులేట్ అయిపోతోంది. అంతా ప్రిపేర్ అయిపోతున్నారు కూడా. కాకపోతే విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. దీనికి ఓ కారణం ఉంది.
ప్రస్తుతం చిరంజీవి సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ) పనిమీద బిజీగా ఉన్నారు. చిరంజీవి పిలుపుతో టాలీవుడ్ నుంచి అంతా తమకు తోచిన విరాళాలు ఇస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఆచార్యతో ట్రాక్ మారిస్తే.. సీసీసీ స్ఫూర్తి దెబ్బతింటుందేమో అని చిరంజీవి అనుమానం. అందుకే ఇప్పటివరకు ప్రకటన రాలేదు. మరికొందరు మాత్రం రేపు, ఎల్లుండి లోగా సీసీసీ పనులైపోతాయని చిరంజీవికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ పెట్టుకోవచ్చా అనే మీమాంశ కూడా చిరులో ఉండేది. అయితే అలాంటి అనుమానాలేం అక్కర్లేదని రంగ్ దే, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి చూపించాయి. సో.. ఈ యాంగిల్ లో చిరు అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. సీసీసీ ఓ కొలిక్కి వచ్చేస్తే ఆచార్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసుకోవచ్చు. రేపు సాయంత్రానికి దీనిపై ఓ క్లారిటీ రాబోతోంది.