ప్రభాస్ ఆదిపురుష్ మరో కొన్ని వారాల్లో థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా ప్రచారం ఆరంభం ఓ నిరాశ, ఓ భయంతో మొదలయింది. టీజర్ చాలా దారుణంగా ఫెయిలయింది. అభిమానులను పూర్తిగా నిరాశలో ముంచింది.
అంతే కాకుండా పలు వివాదాలకు, విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామంతో యూనిట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. అప్పటి నుంచి ఏ కంటెంట్ ను వదులుతారు అన్నా ఫ్యాన్స్ కు కాస్త దడే. కంటెంట్ ఎలా వుంటుందో, అపోనెంట్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఏ లెవెల్ లో వుంటుందో అని.
ఇలాంటి నేపథ్యంలో ట్రయిలర్ వచ్చింది. మరీ అద్భుతంగా కాకపోయినా, ఓకె ఫరవాలేదు అనే భరోసా ఇచ్చింది. ఆదిపురుష్ సినిమా మీద మళ్లీ ఫ్యాన్స్ నమ్మకాలు మొదలయ్యాయి. ఈ రోజు వీడియో బైట్స్ తో కూడిన విడుదల చేసారు. జై శ్రీరామ్..జై శ్రీరామ్..రాజారామ్ అంటూ వానర సైన్యం, రామచంద్రుడి బలంగం పాడుకునే పాట ఇది. ఈ పాట ఇప్పుడు ఫ్యాన్స్ కే కాదు, సినిమా లవర్స్ కు కూడా మంచి ఊపు ఇచ్చింది.
ఈ పాటలో విజువల్స్ చాలా క్లీన్ గా, రిచ్ గా వున్నాయి. రాముడిగా ప్రభాస్ లుక్స్ కూడా బాగున్నాయి. హనుమంతుడు, వానర సైన్యం, సీత ఇలా చూపించిన ప్రతి విజువల్ బాగుంది. ఈ విడియో లో కొన్ని కట్స్ ట్రయిలర్ లోంచి తీసుకున్నవే. కొన్ని కొత్తవి వున్నాయి. మొత్తం మీద ఈపాట ఆదిపురుష్ మీద హోప్స్ పెంచింది.