అదిగో థియేటర్..ఇదిగో సినిమా

అక్టోబర్ 15 నుంచి సగం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే తన సినిమా రెడీ అంటూ ఆర్జీవీ ప్రకటించారు. కరోనా వైరస్ టైటిల్ తో కరోనా వైరస్…

అక్టోబర్ 15 నుంచి సగం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే తన సినిమా రెడీ అంటూ ఆర్జీవీ ప్రకటించారు. కరోనా వైరస్ టైటిల్ తో కరోనా వైరస్ నేపథ్యంలో పిక్చరైజ్ చేసిన సినిమాను విడుదల చేస్తా అంటున్నారు. సరే ఆ ముచ్చట అలా వుంచితే, సగం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయడం అన్నది ఫరవాలేదా అన్నది ప్రశ్న.

దీనికి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి వస్తున్న సమాధానం పాజిటివ్ గానే వుంది. చిన్న సినిమాలు ఎప్పడూ ఫుల్స్ కావు అని, అందువల్ల అప్పుడు అనఫీషియల్ గా సగం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసినట్లే అయింది కదా అన్నది ఆ సమాధానం. ఏసి యూనిట్లను తగ్గించి రన్ చేయడం ద్వారా ఖర్చులు ఆదా చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఎలాగూ వాతావరణం నార్మల్ గా వుంది కాబట్టి అన్ని టన్నులు ఎసి మొత్తం రన్ చేయాల్సిన అవసరం వుండదని అంటున్నారు. 

అయితే థియేటర్ రెంట్ కు తీసుకుంటే సగం ఆక్యుపెన్సీ కాబట్టి సగం రెంట్ కు ఒకె అంటారా? షేరింగ్ మీద వేస్తారా? ఇలాంటి ఫైనాన్సియల్ వ్యవహారాలు అన్నీ ఇంకా వర్కవుట్ చేయాల్సి వుందటున్నారు. ఎగ్జిబిటర్లు అంతా ఒకే విషయంలో ఆశాభావంతో వున్నారు. కనీసం నవంబర్ 1 వరకు అంటే 15 రోజలు కాస్త జాగ్రత్తగా రన్ చేస్తే, ప్రభుత్వం హండ్రడ్ పర్సంట్ ఆక్యుపెన్సీకి లేదా 3/4 ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తుందని, అప్పుడు ఇక సమస్య వుండదని భావిస్తున్నారు.

కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా అయితే కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ విడుదలకు సిద్దం కావు.. దసరా వేళకు ఉప్పెన, రెడ్ లాంటి సినిమాలు రెడీ అవుతాయేమో. థియేటర్లు ఓపెన్ చేసాక తొలివారం ట్రెండ్ చూసి డిసైడ్ అయ్యే అవకాశం వుంది. ట్రెండ్ బాగుంటే ఓటిటి కి ఇచ్చేయాలని డిసైడ్ అయిన సోలో బతుకే సో బెటరు లాంటి సినిమాలు కూడా పునరాలోచనలో పడే అవకాశం వుంది.

కాపు ఓట్ల కోసమే దాసరి కార్డు వాడారా?