ఆదిపురుష్ కు అడ్డంకిగా మారిన సలార్?

ఆదిపురుష్, సలార్.. ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ హీరో. అంతకుమించి ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి సారూప్యత లేదు. అయితే ఇప్పుడీ సినిమాల్లో సలార్ మూవీ, ఆదిపురుష్ కు ఇబ్బందికరంగా మారింది. Advertisement…

ఆదిపురుష్, సలార్.. ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ హీరో. అంతకుమించి ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి సారూప్యత లేదు. అయితే ఇప్పుడీ సినిమాల్లో సలార్ మూవీ, ఆదిపురుష్ కు ఇబ్బందికరంగా మారింది.

ఆది నుంచి ఆదిపురుష్ పై బజ్ తక్కువగా ఉంది. కారణాలు అనేకం. దీనికితోడు టీజర్ పై విపరీతంగా ట్రోలింగ్ జరగడం, విమర్శలు చెలరేగడంతో ఆదిపురుష్ మసకబారింది. దీనికి విరుద్ధంగా సలార్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్ డేట్, వైరల్ అవుతోంది.

ఇలా సలార్ ప్రమోషనల్ మెటీరియల్ వైరల్ అవ్వడం, ఆదిపురుష్ కు అడ్డంకిగా మారింది. ఎందుకంటే, సలార్ కంటే ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆదిపురుష్. ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. ఆ తర్వాతే సలార్.

అందుకే, తన సినిమాలకు సంబంధించి ప్రభాస్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఆదిపురుష్ సినిమా థియేటర్లలోకి వచ్చేంతవరకు సలార్ నుంచి ఎలాంటి ప్రమోషనల్ స్టఫ్ రిలీజ్ కాకూడదని యూనిట్ ను కోరాడంట. మరీ ముఖ్యంగా సలార్ టీజర్ రిలీజ్ అవ్వకూడదని అన్నాడంట.

సో.. రాబోయే రోజుల్లో సలార్ నుంచి అప్ డేట్స్ తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. అదే టైమ్ లో ఆదిపురుష్ ప్రచారాన్ని కాస్త పెంచితే బాగుంటుంది. ఆదిపురుష్ జూన్ లో, సలార్ సెప్టెంబర్ లో థియేటర్లలోకి వస్తున్నాయి.