Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆదిపురుష్ కు క్రేజీ ఆఫర్లు!

ఆదిపురుష్ కు క్రేజీ ఆఫర్లు!

ఆదిపురుష్ సినిమాకు మెలమెల్లగా క్రేజ్ పెరుగుతోంది. కొన్ని రోజుల వరకు ఆదిపురుష్ కు అంత క్రేజ్ లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సలార్ మీదనే దృష్టి పెట్టి వున్నారు. తమ హీరోకి బ్లాక్ బస్టర్ అదే అనే ఆశతో వున్నారు. ఆదిపురుష్ టీజర్ బ్యాక్ ఫైర్ కావడమే దానికి కారణం. 

కానీ ఈ మధ్య కొత్త కొత్త కంటెంట్ సినిమా నుంచి బయటకు వస్తున్న కొద్దీ దాని మీద ఆసక్తి, ఆశలు రెండూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ సినిమా మీద నమ్మకాలు పెట్టుకునే ఆలోచనకు వచ్చారు బయ్యర్లు. ఈ సమ్మర్ మొత్తం పెద్ద సక్సెస్ లు ఎక్కువగా చూడలేదు. నికార్సయిన సక్సెస్ విరూపాక్ష ఒక్కటే. దసరా సినిమా కేవలం నైజాంలో మాత్రమే సక్సెస్.

ఈ సమ్మర్ కు సరైన సినిమా పడలేదనే అసంతృప్తి అలాగే వుంది. ఆదిపురుష్ కు ముందు…వెనుక రెండు మూడు వారాల పాటు గ్రవుండ్ ఖాళీగా వుంది. అందుకే ఇప్పుడు భారీ ఆపర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర మహా అయితే యాభై నుంచి అరవై కోట్లు రేంజ్ వుంటుందేమో అని అనుకున్నారు సినిమా బిజినెస్ జనాలు. కానీ అనూహ్యంగా ఒక్క వైజాగ్ కు కు 20 కోట్ల రేంజ్ ఆఫర్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.

టాలీవుడ్ లో ఇప్పుడు విశాఖ ఓ స్పెషల్. నైజాం మీద కన్నా విశాఖ మీద భరోసా ఎక్కువగా వుంది. ఏ సినిమా అయినా విశాఖ దాదాపు మినిమమ్ గ్యారంటీ అవుతోంది. ఉత్తరాంధ్రలో అర్బన్ సెంటర్లు ఎక్కువగా వుండడం, మల్టీ ఫ్లెక్స్ లు పెరగడం ఇలా అన్నింటి వల్లా అక్కడ ఆదాయం బాగా పెరిగింది. బహుశా అందుకే ఆదిపురుష్ కు ముందుగా అక్కడి నుంచి ఆఫర్ వచ్చి వుంటుంది.

ఓక్క వైజాగ్ ఏరియాకే 20 కోట్ల ఆఫర్ అంటే కేవలం ఆంధ్ర (సీడెడ్ కాకుండా) 90 కోట్ల రేంజ్ లెక్క తేలుతోంది. ఈ లెక్కన నైజాం 60 కోట్లకు పైగానే పలకాలి. అదే రేషియోలో సీడెడ్ పలకాలి. అంటే టోటల్ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కలు దగ్గర దగ్గర ఎలా లేదన్నా 170 కోట్ల వరకు వుంటాయేమో. ఈ నెల 29న ‘సియారామ్..సియారామ్..’ వీడియో  పాట వస్తోంది. అది ఏమాత్రం బాగున్నా, ఆదిపురుష్ క్రేజ్ మరింత పెరుగుతుంది.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా