హీరోల్ని పెళ్లి ఎప్పుడు అని అడిగితే దాటవేత సమాధానాలు బాగా చెబుతారు. ఓ హీరో, మరో హీరోపై నెపాన్ని నెట్టేస్తాడు. అడవి శేష్ కూడా అదే పని చేశాడు. తన పెళ్లి గురించి అడిగితే, ప్రభాస్-అనుష్కలకు ఇంకా పెళ్లిళ్లు కాలేదు కదా అని సమాధానం ఇచ్చాడు.
“ఇండస్ట్రీలో పెళ్లి కావాల్సిన వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ల పెళ్లిళ్లు అయ్యాక చూద్దాం. నా ఫ్రెండ్ అనుష్క ఉంది. ఇంకా పెళ్లి చేసుకోలేదు. రానాకు పెళ్లి అయిపోయింది కానీ, ప్రభాస్ కు ఇంకా అవ్వలేదు. వాళ్ల పెళ్లిళ్లు అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా.”
ఇలా తన పెళ్లి మేటర్ ను సైడ్ చేశాడు శేష్. అయితే లవ్ ప్రపోజల్స్ మాత్రం చాలా వచ్చాయని తెలిపాడు. తనకు ప్రపోజ్ చేసిన వాళ్లలో పెళ్లయిన మహిళలు కూడా ఉన్నారంటున్నాడు.
“చాలా లవ్ ప్రపోజల్స్ వచ్చాయి. కొన్ని సార్లు పెళ్లయిన వాళ్లు కూడా వచ్చి ప్రపోజ్ చేశారు. భర్తను వదిలేస్తా, పెళ్లి చేసుకో అన్నారు. ఇప్పటివరకు ఏ ప్రపోజల్ ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోమని మా అమ్మ రోజూ సతాయిస్తోంది. చివరికి ఏ స్థాయికి వచ్చారంటే, అమ్మాయైతే చాలు పెళ్లి చేసుకో అంటున్నారు. కొరియన్ అమ్మాయి అయినా ఓకే అనే స్టేజ్ కు వచ్చేశారు. కానీ నాకే ఎవ్వరూ సెట్ అవ్వడం లేదు.”
ప్రస్తుతం మేజర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు శేష్. ఈ సినిమా రిలీజైన తర్వాత గూఢచారి-2 స్టార్ట్ చేస్తాడు. చాలామంది గూఢచారి-2 సినిమా సగం షూటింగ్ పూర్తయిందని అనుకుంటున్నారని, కానీ ఆ సినిమాకు సంబంధించి కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశామని, కథపై కూడా వర్కవుట్ చేయలేదని స్పష్టంచేశాడు శేష్.