అడవి శేష్ కు ఓ మార్కెట్

హీరోల సినిమాలకు వచ్చే ఓపెనింగ్ ను బట్టే వాళ్ల సినిమాల మార్కెట్ ఆధారపడి వుంటుంది. ఆపై వాళ్ల సినిమాల బిజినెస్, రెమ్యూనిరేషన్ ఇలా అన్నీ వుంటాయి. హీరోకి ఇరవై థియేటర్ కోట్ల మార్కెట్ వుందీ…

హీరోల సినిమాలకు వచ్చే ఓపెనింగ్ ను బట్టే వాళ్ల సినిమాల మార్కెట్ ఆధారపడి వుంటుంది. ఆపై వాళ్ల సినిమాల బిజినెస్, రెమ్యూనిరేషన్ ఇలా అన్నీ వుంటాయి. హీరోకి ఇరవై థియేటర్ కోట్ల మార్కెట్ వుందీ అంటే మరో ఇరవై కోట్ల నాన్ థియేటర్ వుండనే వుంటుంది. యంగ్ హీరోలు అందరూ ఈ ఫీట్ ను సాధించడం కష్టం. స్లో అండ్ స్టడీగా అడవి శేష్ ఈ ఫీట్ ను సాధించేసినట్లు కనిపిస్తోంది.

హిట్ 2 సినిమా థియేటర్ బిజినెస్ దాదాపు 20 కోట్ల రేంజ్ లో జరిగింది. ఓవర్ సీస్ లో కావచ్చు, ఆంధ్రలో ఒకటి రెండు ఏరియాలు కావచ్చు, పోటీ పడి రేట్లు పెంచడాలు, రికమెండేషన్లు జరిగాయి అంటే సినిమా మీద బజ్ తో పాటు అడవి శేష్ మీద నమ్మకం కూడా తోడయింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఓవర్ సీస్ లో మంచి ఓపెనింగ్ తీసుకున్న సినిమాల్లో హిట్ 2 ఒకటి. అక్కడ వన్ మిలియన్ దగ్గర చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.

అడవి శేష్ తన సినిమా మేకింగ్ లో ఎంత కష్టపడతాడో, ప్రమోషన్ మీద కూడా అంత దృష్టి పెడుతున్నాడు. అది కూడా అతగాడికి ప్లస్ అవుతోంది. అన్నింటికి మించి అస్సలు ఆటిట్యూడ్ అన్నది కనిపించనివ్వడు. దాంతో సోషల్ మీడియాలో శేష్ కు నెగిటివిటీ తక్కువ. ఇప్పుడిప్పుడే ఒకటి రెండు సక్సెస్ లు అందుకున్న యంగ్ హీరోల ఆటిట్యూడ్ తో పోల్చుకుంటే శేష్ చాలా డౌన్ టు ఎర్త్ వున్నట్లు లెక్క.

గూఢచారి సినిమా మరే హీరో అయినా దానికి మూడింతలు ఖర్చు అయ్యేది. కానీ శేష్ చాలా బడ్జెట్ లో ఆ సినిమా చేసాడని నిర్మాతలు ఇప్పటికీ అంటారు. శేష్ ఇన్ వాల్వ్ మెంట్, ప్లానింగ్ సినిమాలకు ప్లస్ అవుతున్నాయని నిర్మాతలు హ్యాపీ. అలా అని తొందరపడి సినిమాలు ఓకె చేయడం లేదు. వెల్ ప్లాన్డ్ గా స్డడీగా ముందుకు వెళ్తున్నాడు శేష్.