ఏజెంట్ నిడివి 2.26

సురేందర్ రెడ్డి-అఖిల్ కాంబినేషన్ లో తయారైన సినిమా ఏజెంట్. ఈ సినిమా సెన్సారు ఫార్మాలిటీ పూర్తయింది. య/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ నెల 28న సినిమా థియేటర్ లలోకి వస్తోంది. ఈ సినిమా మీద…

సురేందర్ రెడ్డి-అఖిల్ కాంబినేషన్ లో తయారైన సినిమా ఏజెంట్. ఈ సినిమా సెన్సారు ఫార్మాలిటీ పూర్తయింది. య/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ నెల 28న సినిమా థియేటర్ లలోకి వస్తోంది. ఈ సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డికి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. 

సినిమాలను కొత్తగా ప్రెజెంట్ చేస్తారని, భారీగా వుంటాయని హీరోల ఫ్యాన్స్ కు ఆశలు వున్నాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న అఖిల్ అక్కినేనికి ఈసారి ఆ జాక్ పాట్ ఏజెంట్ సినిమాతో తగులుతుందని అంతా ఎదురుచూస్తున్నారు.

ఏజెంట్ సినిమా స్టయిలిష్ యాక్షన్ స్పెయ్ జానర్ సినిమా. మన తెలుగులో ఎక్కువగా కనిపించే ప్యాకేజ్ సినిమా కాదు. కామెడీ, భారీ డైలాగులు, డ్యూయట్లు ఇలా ప్యాకేజ్ వుండదు. పూర్తిగా ఓ మిషన్ మీద సినిమా కథ రన్ అవుతూనే వుంటుంది. యాక్షన్ సీన్ కు యాక్షన్ సీన్ కు లింక్ అన్నట్లుగా కథను ముందుకు నడిపే సీన్లు వుంటాయి. వీటిలోనే హీరోయిన్, కొన్ని పాటలు మిక్స్ చేసారని తెలుస్తోంది.

ప్రేక్షకులను రిలీఫ్ కోసం, ఆసక్తిగా వుండడం కోసం ఓ స్పెషల్ సాంగ్ యాడ్ చేసారు. సినిమా అంతా అవుట్ అండ్ ఓ జేమ్స్ బాండ్ సినిమా మాదిరి స్క్రీన్ ప్లే తో నడుస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కు దూరంగా వుంటుంది. ఇంగ్లీష్ సినిమాలు చూడడం వేరు.. మన హీరోలు ఇలాంటి యాక్షన్ సీన్లు, రకరకాల లోకేషన్లు, కొత్త కొత్త గన్ లు పట్టుకుంటే వచ్చే ఫీల్ వేరు. ఏజెంట్ అలాంటి ఫీల్ ను అందించే సినిమా అని తెలుస్తోంది.