దర్శకుడు సురేందర్ రెడ్టి చిరకాలంగా చెక్కుతున్న శిల్పం ‘ఏజెంట్’. ఎప్పుడో మొదలుపెట్టారు. చెక్కుతూనే వున్నారు. నిర్మాత అనిల్ సుంకర అలా భరిస్తూ వస్తున్నారు.
నలభై కోట్ల ప్రాజెక్టు అన్నది ఎనభై కోట్ల మేరకు చేరింది. మొత్తం మీద సినిమా ఓ కొసకు చేరుకుంది. గత ఏడాది నుంచి ఈ సంక్రాంతి వరకు ఇదిగో వస్తుంది..అదిగో వస్తుంది అనుకున్నారు. ఆఖరికి ఏప్రిల్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రేపో, ఆ మర్నాడో రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వస్తుంది.
ఇదిలా వుంటే ఏజెంట్ టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం అయిదు రోజుల ఛేజ్ మాత్రం ఇంకా బకాయి వుంది. విదేశాల్లో ఈ ఛేజ్ ను తీయాల్సి వుంది. పోస్ట్ ప్రొడక్షన్ తో కలిపి ఏప్రిల్ నాటికి సినిమా పక్కాగా రెడీ అవుతుంది.
ప్రీ సమ్మర్ లో వస్తోంది. పైగా అఖిల్ చేస్తున్న ఈ సినిమాకు కాస్త బజ్ వుంది. అందువల్ల మంచి ఓపెనింగ్ పక్కాగా వుంటుంది.ఇదిలా వుంటే మార్కెట్ కు మించి ఖర్చు చేసిన సినిమా తీయడంతో నిర్మాత మీద అభిమానంతో హీరో అఖిల్ అదే బ్యానర్ లో మరో సినిమా చేస్తారని తెలుస్తోంది.