ఏజెంట్…టీజర్ వస్తోంది

అఖిల్ అక్కినేని భారీ సినిమా ఏజెంట్. దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా సినిమా తరువాత చేస్తున్న మూవీ. చిరకాలంగా ప్రొడక్షన్ లో వున్న ఈ సినిమా టీజర్ అనౌన్స్ మెంట్ వచ్చింది.  Advertisement సో…

అఖిల్ అక్కినేని భారీ సినిమా ఏజెంట్. దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా సినిమా తరువాత చేస్తున్న మూవీ. చిరకాలంగా ప్రొడక్షన్ లో వున్న ఈ సినిమా టీజర్ అనౌన్స్ మెంట్ వచ్చింది. 

సో అక్కినేని ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఏజెంట్ సినిమా కోసం కాస్త ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. జూలై 15న ఏజెంట్ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత అనిల్ సుంకర ప్రకటించారు. చాలా భారీ వ్యయంతో ఏజెంట్ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇండియాలోని వివిధ లోకేషన్లలో అలాగే విదేశాల్లో ఏజెంట్ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమా కోసం అఖిల్ బాగా బాడీని పెంచాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఏజెంట్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మమ్ముట్టి, సాక్షి వైద్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమీషా సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా సినిమాలో నిర్మాణ భాగస్వామి.