
అల్లు వారి ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉద్దేశం ఏంటో తెలియదు కానీ, బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఓ వర్గం ప్రేక్షకుల్ని దూరం చేసుకుంది. ఆ పరంపర మరింత వేగంగా జరుగుతున్నట్టే కనిపిస్తోంది. నారా, నందమూరి కుటుంబాల సొంత డబ్బా, వారి రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎపిసోడ్స్ నడుస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘అన్‌స్టాపబుల్ - 2’ టాక్‌షో వ్యాఖ్యాత బాలకృష్ణ స్వామి కార్యం, స్వకార్యం అన్నట్టుగా తమ రాజకీయ ప్రయోజనాలకు ఈ వేదికను బాగా వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటర్వ్యూకు సంబంధించి రెండో ప్రోమో విడుదలైంది. ఇందులో ఏపీకి సంబంధించి మూడు రాజధానులపై కిరణ్‌ను బాలయ్య ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తన సహజమైన వచ్చీరానీ తెలుగులో ముందర ఉన్న పరిస్థితులు వేరే, ఇప్పుడు వేరే అంటూ చెప్పుకొచ్చారు.
బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడంతో టీడీపీ ప్రత్యర్థులు, ఇతర పార్టీల నాయకులు ఆ షోకు వెళ్లడానికి ఇబ్బందిగా తయారైందని చెప్పొచ్చు. టీడీపీకి జాకీలు వేయడానికి ఎల్లో చానళ్లు చాలవన్నట్టు, అల్లు అరవింద్ వారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా తయారైందనే టాక్ వినిపిస్తోంది.
‘అన్‌స్టాపబుల్ - 2’కు సంబంధించి మొదటి ఎపిసోడ్‌కు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వెళ్లారు. చివరికి ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేయడంలో తప్పేమీ లేదన్న సంకేతాల్ని పంపే ప్రయత్నంలో బాలయ్య, బాబు బద్నాం అయ్యారు. జనం ఛీత్కరించుకునేలా టాక్‌షో నడిచిందని చెప్పొచ్చు.
చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటర్వ్యూలలో కొసమెరుపు ఏంటంటే ....దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి గొప్పగా చెప్పడం. కనీసం ఈ మాత్రమైనా లేకపోతే... పూర్తిగా ఎల్లో ముద్ర పడుతుందనే భయం నిర్వాహకులను వెంటాడుతున్నట్టుంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా