పెళ్లి పీటలు ఎక్కనున్న సీనియర్ హీరో కూతురు!

త్వరలో మరో హీరోయిన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతోంది. అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్ మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతోంది. తమిళ నటుడు ఉమాపతితో ఈ హీరోయిన్ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ…

త్వరలో మరో హీరోయిన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతోంది. అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్ మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతోంది. తమిళ నటుడు ఉమాపతితో ఈ హీరోయిన్ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఈ జంట ఇంకా నిర్థారించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అంతలోనే వీళ్ల పెళ్లిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

అవును.. ఐశ్వర్య అర్జున్, ఉమాపతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ మేరకు ఐశ్వర్య తండ్రి అర్జున్ నుంచి, ఉమాపతి తండ్రి నటుడు రామయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరికొన్ని రోజుల్లో ఈ జంట నిశ్చితార్థం చేసుకోబోతోంది.

చెన్నైలో అర్జున్ స్వయంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆ గుడిలోనే ఐశ్వర్య అర్జున్-ఉమాపతి ఉంగరాలు మార్చుకుంటారట. నిశ్చితార్థం పూర్తయిన తర్వాత స్వయంగా అర్జున్, తన కూతురు పెళ్లి మేటర్ ను అధికారికంగా ప్రకటిస్తారట.

తమిళ్ లో అర్జున్ నిర్వహించిన ఓ టీవీ కార్యక్రమంలో ఉమాపతి పాల్గొన్నాడు. అదే టైమ్ లో ఉమాపతికి, ఐశ్వర్య పరిచయమైంది. అప్పట్నుంచి ఇద్దరూ టచ్ లోనే ఉన్నారు. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు.

31 ఏళ్ల ఐశ్వర్య అర్జున్, తండ్రి ఆశీస్సులతో హీరోయిన్ గా కోలీవుడ్ లో ఎంటరైంది. అయితే ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కూతుకు కెరీర్ ను నిలబెట్టేందుకు ఒక దశలో స్వయంగా అర్జున్, స్వీయదర్శకత్వంలో నిర్మాతగా ఓ సినిమా ప్లాన్ చేశాడు. అందులో హీరోగా విశ్వక్ సేన్ ను తీసుకున్నాడు. అంతా ఓకే అనుకున్న టైమ్ కు ఆ ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ తప్పుకున్నాడు.

అప్పట్నుంచి ఆ ప్రాజెక్టుపై ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇలా ఐశ్వర్య అర్జున్ కు హీరోయిన్ గా కాలం కలిసిరాకపోవడంతో, ఇప్పుడు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటోంది.