సీనియర్ నటుడు అర్జున్ కూతురు, హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఐశ్వర్య అర్జున్, ఉమాపతి పెళ్లి సోమవారం గ్రాండ్ గా జరగనుంది. దీనికి సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి.
అర్జున్ ఇంట్లో హల్దీ ఫంక్షన్ తో ఈ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది. ఈ వేడుకలో అనామిక ఖన్నా డిజైన్ చేసిన దుస్తుల్ని ధరించి, అందంగా కనిపించింది ఐశ్వర్య అర్జున్. ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం స్వయంగా అర్జున్, వ్యాఖ్యాతగా మారాడు. ఆహుతులతో కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించాడు.
రేపు సంగీత్ నిర్వహించబోతున్నారు. ఇక సోమవారం రోజున చెన్నైలో అర్జున్ కట్టిన హనుమాన్ ఆలయంలో ఐశ్వర్య-ఉమాపతిల వివాహం జరుగుతుంది. ఆ తర్వాత 14వ తేదీన గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
అంతకంటే ముందు తన ఫ్రెండ్స్ కు గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది ఐశ్వర్య. దీని కోసం స్నేహితుల్ని తీసుకొని ఇండోనేషియాలోని బాలికి వెళ్లింది. బాలీలో జాలీగా ఎంజాయ్ చేయడంతో పాటు.. కాబోయే భర్త ఉమాపతితో కలిసి పుట్టినరోజు వేడుకల్ని కూడా సెలబ్రేట్ చేసుకుంది. గతేడాది అక్టోబర్ లో ఐశ్వర్య-ఉమాపతి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.