అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ విషయాలు అన్నీ గుట్టుగా దాస్తోంది సితార ఎంటర్ టైన్ మెంట్స్. దాంతో రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ గ్యాసిప్ లే నిజమైతే అసలు అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ చేయడం అనవసరం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయ్యప్పన్ లో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తారు అని తెలిసిన దగ్గర నుంచి ముందుగా వినిపిస్తున్న గ్యాసిప్ రెండో హీరో పాత్ర ను డౌన్ చేస్తారని, విలన్ గా మారుస్తారని. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదని యూనిట్ వర్గాలు క్లారిటీగా చెబుతున్నాయి. పైగా రెండో హీరో పాత్ర మరింత మెరుగ్గా వుంటుందంటున్నారు. రెండో హీరో ఫ్యామిలీ క్యారెక్టర్ లు మరింత ఎలివేట్ అవుతాయంటున్నారు.
ఇక మరో గ్యాసిప్ రెండో హీరో పాత్రకు విజయ్ సేతుపతి, సుదీప్, గోపీచంద్ లాంటి పేర్లు వినిపించడం. ఇప్పటి వరకు అయితే రానా అనే సీన్లో వున్నారు. రానా చేస్తాననే అంటున్నారు. ఆ దిశగానే డిస్కషన్లు జరుగుతున్నాయి.
సేతుపతిని ఓ దశలో అనుకున్నారు కానీ అప్పుడే డ్రాప్ అయ్యారు. ఇక గోపీచంద్ అంటే అంత కన్నా జోక్ మరోటి వుండదు. సినిమాకు మల్టీ స్టారర్ లుక్ రావాలి, రెండో పాత్ర పండాలి అంటే సరైన హీరో వుండాల్సిందే. గొపీచంద్ ను పెడితే ఆ లుక్ రమ్మన్నా రాదు.
ఇదిలా వుంటే నూటికి తొంభై తోమ్మిది శాతం రానానే అయ్యప్పన్ లో వుంటారని, ఆ వన్ పర్సంట్ మాత్రం వేరే యంగ్ హీరోకు అవకాశం వుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆ యంగ్ హీరో జాయిన్ అయితే క్రేజ్ ఓ రేంజ్ లో వుంటుందని, అయితే డేట్ లు ప్రోబ్లమ్ వస్తుందని అందుకే రానాతోనే వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అంతే తప్ప గోపీచంద్ లాంటి పేర్లు కనీసం పరిశీలనలో కూడా లేవని తెలుస్తోంది.