హిట్ కొట్టినా సినిమా చేతిలో పడడం అంత సులువు కాదు. ఒక్కోసారి ఫ్లాప్ వచ్చినా టక్కున సినిమా చేతిలో పడుతుంది.
టాలీవుడ్ లో అంతే. నాంది సినిమాతో శభాష్ అనిపించుకుని, తన పేరునే నాంది విజయ్ గా చేసేసుకున్నాడు. అప్పటి నుంచి రెండో సినిమా కోసం చేయని ప్రయత్నం లేదు.
అందరికన్నా ముందుగా చైతన్య దగ్గరకు వెళ్లారు. ఆ తరువాత కళ్యాణ్ రామ్, గోపీచంద్ ఇలా చాలా మందిని ట్రయ్ చేసారు. కథ నప్పక కొందరు, డేట్ లు ఖాళీలేక మరి కొందరు ఇలా ఎక్కడికేళ్లినా చుక్క ఎదురైంది. దాంతో ఆఖరికి గెలిచిన చోటే మళ్లీ ప్రయత్నించాలని డిసైడ్ అయిపోయాడు. అల్లరి నరేష్ కే ఒక నెరేషన్ ఇచ్చారు. ఇంకో నెరేషన్ ఇవ్వాలి.
నాంది లాంటి సినిమా ఇచ్చిన నమ్మకంతో అల్లరి నరేష్ సై అంటాడో? లేదా హ్యాండిస్తాడో అన్నది ఒకటి రెండు రోజుల్లో తెలస్తోంది. అన్నట్లు ఇక్కడ అసలు విషయం ఏమిటంటే కళ్యాణ్ రామ్ కు చెప్పిన కథనే అల్లరి నరేష్ కూ చెప్పడం. సూటవుతుందా? ఏమో?
హీరో ఎవరైనా నిర్మాత మాత్రం షైన్ స్క్రీన్స్ సాహూ నే.