కనిపించని బన్నీ.. కుదరని రాజీ

ఒకే వేదికపై చిరు-బన్నీ కలిసి కనిపిస్తే ఫ్యాన్ వార్స్ కాస్త తగ్గుతాయని అంతా అనుకున్నారు.

మెగా-పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య నడుస్తున్న సోషల్ మీడియా వార్ గురించి అందరికీ తెలిసిందే. మధ్యమధ్యలో తన ట్వీట్స్ తో ఈ యుద్ధానికి ఆజ్యం పోస్తూనే ఉన్నారు నాగబాబు.

ఓవైపు ఇలా నడుస్తుండగా, మరోవైపు చిరంజీవి-బన్నీ కలిసే సందర్భం వచ్చింది. బాలయ్య 50 వసంతాల సినీ కెరీర్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి చిరంజీవి, అల్లు అర్జున్ కు ఆహ్వానాలు అందాయి.

ఒకే వేదికపై చిరు-బన్నీ కలిసి కనిపిస్తే ఫ్యాన్ వార్స్ కాస్త తగ్గుతాయని అంతా అనుకున్నారు. ఆ మేరకు అల్లు అరవింద్ కూడా తెరవెనక ఏర్పాట్లు చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ బాలయ్య ఫంక్షన్ కు బన్నీ రాలేదు.

నిజానికి బాలకృష్ణకు అల్లు అరవింద్, బన్నీ చాలా క్లోజ్. ‘ఆహా’లో వస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని బాలయ్య రక్తికట్టిస్తున్న సంగతి తెలిసిందే. అదే కార్యక్రమంలో బన్నీ-బాలయ్య సాన్నిహిత్యాన్ని కూడా చూశాం. కట్ చేస్తే, రాత్రి ఫంక్షన్ కు అల్లు అర్జున్ రాలేదు

నాగార్జున దూరం..

అటు నాగార్జున కూడా ఈ ఫంక్షన్ కు హాజరుకాలేదు. వీళ్లిద్దరి మధ్య అభిప్రాయబేధాలున్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో బాలయ్యను కలుపుకొని పోవాలని నాగ్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ క్రమంలో బాలయ్య వేడుకకు నాగ్ కూడా డుమ్మా కొట్టినట్టు కనిపిస్తోంది.

ఇంకా చెప్పాలంటే, బాలయ్య 50 వసంతాల సినీ కెరీర్ వేడుకకు అక్కినేని కుటుంబం మొత్తం దూరమైంది. సాధారణంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు నాగచైతన్యను ముందుకు తోస్తారు నాగ్. తన తరఫున పెద్ద కొడుకు చైతూను పంపిస్తుంటారు. కానీ ఈసారి ఆ పని కూడా చేయలేదు.

ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ కూడా..

ఇక ఈ వేడుకకు ఎన్టీఆర్ దూరంగా ఉంటాడనే విషయాన్ని అంతా ముందుగానే గ్రహించారు. ఎందుకంటే, తారక్ ప్రస్తుతం పలు దేవాలయాల సందర్శనలో ఉన్నాడు. నిజానికి అతడు తలుచుకుంటే బాలయ్య ఫంక్షన్ కు రావడం పెద్ద పని కాదు. కాకపోతే నందమూరి కుటుంబానికి, ఎన్టీఆర్ కు మధ్య ఉన్న గ్యాప్ సంగతి అందరికీ తెలిసిందే కదా.

ఇక ఈమధ్య కాలంలో నందమూరి కుటుంబానికి కాస్త దూరంగా, ఎన్టీఆర్ కు చాలా దగ్గరగా ఉంటున్న కల్యాణ్ రామ్ కూడా ఈ వేడుకలో కనిపించలేదు. అతడు ఎందుకు హాజరుకాలేదనే కారణం ఇంకా బయటకురాలేదు.

16 Replies to “కనిపించని బన్నీ.. కుదరని రాజీ”

  1. 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిటైనింగ్‌ వాల్‌ నిర్మించింది. కృష్ణా నదిలో 3.1 కిలోమీటర్ల మేర పొడవునా ఈ రిటైనింగ్‌ వాల్‌ ఉంది. ఈ రిటైనింగ్‌ వాల్‌ ఉండటంతో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమలకుదురు ప్రాంతాలకు వరదనీరు చేరలేదు

    1. అదేంటి బ్రదర్, fb లో ఏదో టీడీపి వింగ్ ఏమో 2019 ఆగష్టు టైంకి 70% పూర్తి చేసిన టీడీపి అని పోస్ట్స్ పెట్టారు, మీరేమో 2014లో రాగానే నిర్మించేసారు అని అంటున్నారు…… అందరూ కలిపి ఒక మాట అనుకుని అదే ప్రచారంలో పెట్టండి. ఇలా విడివిడిగా అయితే ఇప్పుడు దొరికిపోయినట్టే దొరికిపోతారు

  2. గూగుల్‌ ఎర్త్‌ లో, 2019 ఏప్రిల్‌ నాటికే చూపిస్తున్న కృష్ణలంక రీటైనింగ్‌ వాల్‌..

  3. 😂😂…. ఇవ్వాళ మన ఏడుపుల పాయ డ్రామా లో అన్నయ్య , శెల్లెమ్మ ఎందుకు కవలలేదని ఎవరు అడగలేదా GA…..

  4. వాళ్ళు రాజీ పడాలి అనుకుంటే ఒకరు ఇంటికి మరొకరు వెళ్లి రాజీ పడతారు కానీ… ఎవరో వేరే వాళ్ల ఈవెంట్ ని ఎందుకు choose చేసుకుంటారు?

Comments are closed.