అల్లు శిరీష్ కు డైరక్టర్ ఫిక్స్

మెగా హీరోల్లో అందరి కన్నా పూర్తిగా వెనుకబడి వున్న అల్లు శిరీష్ కోసం ఓ ప్రాజెక్టును సిద్దం చేసారు. ఇందుకోసం ఓ తమిళ సినిమా హక్కులు కొని, దాన్ని సరైన స్క్రిప్ట్ గా మార్చే…

మెగా హీరోల్లో అందరి కన్నా పూర్తిగా వెనుకబడి వున్న అల్లు శిరీష్ కోసం ఓ ప్రాజెక్టును సిద్దం చేసారు. ఇందుకోసం ఓ తమిళ సినిమా హక్కులు కొని, దాన్ని సరైన స్క్రిప్ట్ గా మార్చే పని మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం పూర్తయింది. స్క్రిప్ఠ్ సంతృప్తికరంగా వచ్చింది. 

దర్శకుడు ఎవరో కాదు, జతకలిసే, విజేత సినిమాలు అందించిన రాకేష్ శశి. ఈ దర్శకుడు ఇప్పటికి రెండు విఫలయత్నాలు చేసాడు. మెగా అల్లుడు కళ్యాణ్ ధేవ్ తో చేసిన విజేత డిజాస్టర్ అయింది. మరి ఈ డైరక్టర్ ను అల్లు శిరీష్ కోసం ఎందుకు ఎంపిక చేసారో అల్లు అరవింద్ కే తెలియాలి.

కానీ విషయం ఏమిటంటే, తమిళ సినిమా స్క్రిప్ట్ ను ఈ దర్శకుడు చాలా బాగా తయారుచేసాడని, అందుకే డైరక్షన్ చాన్స్ కూడా అతనికే అల్లు అరవింద్ అప్పగించారని తెలుస్తోంది. ఏమైనా ఆహా ఓటిటి ప్లాట్ ఫారమ్ వచ్చాక అల్లు అరవింద్ ఇలాంటి చిన్న సినిమాలు చాలా తీస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?

మాట, గౌరవం రెండూ నిలబెట్టుకున్న జగన్