హీరోయిన్ అమలాపాల్ మళ్లీ పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న ముంబయి బేస్డ్ సింగర్ భవినీందర్ సింగ్ ను ఆమె పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా ఆమె ఎక్కడా చెప్పలేదు. సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి జరుగుతున్నట్టు ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
నిజానికి ఈ ఫొటోలు పెట్టింది ఎవరో కాదు. స్వయంగా తన ఇనస్టాగ్రామ్ పేజీలో సింగర్ భవినీందర్ సింగ్ ఈ ఫొటోస్ పెట్టాడు. అయితే అంతలోనే వాటిని అతడు డిలీట్ చేశాడు. బహుశా, పెళ్లి విషయాన్ని ఈ జంట మరికొన్నాళ్ల పాటు గోప్యంగా ఉంచాలని అనుకుంటుందేమో.
దర్శకుడు ఏఎల్ విజయ్ ను 2014లో పెళ్లి చేసుకుంది అమలాపాల్. అయితే వారి వైవాహిక జీవితం అనుకున్నంత సాఫీగా సాగలేదు. కుటుంబ కలహాల వల్ల 2017లో వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దర్శకుడు ఏఎల్ విజయ్ ఓ డాక్టర్ ను పెళ్లాడాడు. ఇప్పుడు అమలాపాల్ కూడా ఈ సింగర్ తో లైఫ్ లో సెటిల్ అయినట్టు కనిపిస్తోంది.
తను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాననే విషయాన్ని కొన్నాళ్ల కిందట ప్రకటించింది అమలాపాల్. ఆ వ్యక్తి భవినీందర్ సింగ్ అనే విషయాన్ని ఆమె చెప్పకపోయినా మీడియా కనిబెట్టేసింది. ఆ తర్వాత భవినీందర్ ఇనస్టాగ్రామ్ లో వాళ్లిద్దరూ కలిసున్న ఫొటోలు కొన్ని దర్శనమిచ్చాయి. ఇప్పుడు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్టు కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి.
వీళ్లిద్దరి పెళ్లి రీసెంట్ గా జరిగిందా, లేక చాన్నాళ్ల కిందటే ఇద్దరూ ఒక్కటయ్యారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అటు భవినీందర్ మాత్రం థ్రోబ్యాక్ (పాత ఫొటోలు) అంటూ ఈ స్టిల్స్ రిలీజ్ చేసి, తర్వాత డిలీట్ చేశాడు. త్వరలోనే ఈ సస్పెన్స్ కు అమలాపాల్ తెరదించుతుందేమో చూడాలి.