సామాజిక, రాజకీయ, చిత్ర రంగాలపై నటి శ్రీరెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆమె తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు. క్యాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించి ప్రాంతీయ, జాతీయ మీడియా దృష్టిని తన వైపు తిప్పుకున్న శ్రీరెడ్డి….రెండేళ్ల క్రితం తెలుగు చానళ్ల రేటింగ్స్ పెంచడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడామె తన మకాంను చెన్నైకి మార్చారు.
ప్రముఖ హీరోయిన్ అమలాపాల్‌పై నటి శ్రీరెడ్డి తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై అమలాపాల్ అభిమానులు మండిపడుతున్నారు. ఎప్పుడెలాంటి ట్వీట్‌లు చేయాలో తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ శ్రీరెడ్డి ఏం ట్వీట్ చేశారో తెలుసుకుందాం.
‘బాధపడకు అమలాపాల్.. నీ పంజాబీ భర్త బాగానే చూసుకుంటాడు. నాకు పంజాబీలపై నమ్మకం ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీటే అమలాపాల్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారీతో జనం విలవిలలాడుతున్న సమయంలో శ్రీరెడ్డి ఇలాంటి పోస్టులు చేయడం అవసరమా అంటూ ప్రశ్నించడమే కాదు విమర్శిస్తున్నారు.
ఇటీవల నటి అమలాపాల్.. ప్రియుడు, ముంబైకు చెందిన గాయకుడు భవ్నీందర్ సింగ్‌ను వివాహం చేసుకున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అమలాపాల్ తనకు వివాహం జరగలేదని, అవి కేవలం ఫొటోషూట్ కోసం దిగిన ఫొటోలని స్పష్టం చేశారు.
కానీ భవ్నీందర్ సింగ్‌ను వివాహం చేసుకోలేదని అమలాపాల్ ప్రకటించిన తర్వాత…తాజాగా శ్రీరెడ్డి నీ పంజాబీ భర్త బాగా చూసుకుంటాడనడం, పంజాబీలపై తనకు నమ్మకం ఉందంటూ ట్వీట్ చేయడం వివాదానికి కారణమైంది. ఏం చేద్దాం కొందరికి ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉంటే తప్ప మనసు ప్రశాంతంగా ఉండదేమో!