పేరుకే అమిగోస్.. నాట్ ఫ్రెండ్స్, నాట్ బ్రదర్స్

క్లోజ్ ఫ్రెండ్ ను స్పానిష్ లో అమిగోస్ అని పిలుస్తారు. అలాంటి పదాన్ని కల్యాణ్ రామ్ సినిమాకు టైటిల్ గా పెట్టారు. అలా అని ఇదేదో ఫ్రెండ్ షిప్ మీద తీసిన సినిమా కాదు.…

క్లోజ్ ఫ్రెండ్ ను స్పానిష్ లో అమిగోస్ అని పిలుస్తారు. అలాంటి పదాన్ని కల్యాణ్ రామ్ సినిమాకు టైటిల్ గా పెట్టారు. అలా అని ఇదేదో ఫ్రెండ్ షిప్ మీద తీసిన సినిమా కాదు. కొద్దిసేపటి కిందట విడుదలైన ట్రయిలర్ తో ఆ క్లారిటీ ఇచ్చేశారు.

కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా అమిగోస్. ఈ సినిమా పేరుకే అమిగోస్.. ఇందులో మూడు పాత్రలు ఒకేలా కనిపించినప్పటికీ, వాళ్లు ఫ్రెండ్స్ కాదు, బ్రదర్స్ అంతకంటే కాదు. మరీ ముఖ్యంగా ఓ పాత్ర నెగెటివ్ షేడ్స్ లో ఉంది. ఇండియాకు సంబంధించి అతడో పాబ్లో ఎస్కోబార్ అన్నమాట.

అలాంటి విలన్ పాత్రతో, మిగతా రెండు పాత్రలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయనేది అమిగోస్ సినిమా కథ. ట్రయిలర్ లో కల్యాణ్ రామ్ 3 పాత్రల్ని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. సినిమాకొచ్చిన ప్రేక్షకుడు లేనిపోని అంచనాలు పెట్టుకోకూడదనే ఉద్దేశంతో, ట్రయిలర్ లో పాత్రల ఛాయలతో పాటు, కథను కూడా కొద్దిగా రివీల్ చేశారు.

ముగ్గురు కల్యాణ్ రామ్ లు ఒకరితో ఒకరు ఫైట్ చేసే సన్నివేశాన్ని ట్రయిలర్ లో పెట్టి సినిమాపై అంచనాల్ని పెంచే ప్రయత్నం చేశారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కల్యాణ్ రామ్ లుక్ డిఫరెంట్ గా ఉంది. బింబిసార పాత్ర కోసం తొలిసారి గొంతు మార్చి మాట్లాడిన కల్యాణ్ రామ్, అదే మాడ్యులేషన్ ను అమిగోస్ లోని విలన్ రోల్ కోసం కూడా కొనసాగించాడు. రీమిక్స్ సాంగ్, హీరోయిన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కు కూడా ట్రయిలర్ లో చోటిచ్చారు.

ట్రయిలర్ లో సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి. రాజేంద్ర రెడ్డి డైరక్షన్ లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలోకి వస్తోంది.