Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచిన కల్కి

మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచిన కల్కి

విడుదల చేస్తున్న ప్రతి కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అదే టైమ్ లో సినిమాపై అంచనాలు కూడా పెంచుతున్నాడు. తాజాగా అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించి ఇంట్రో వీడియో రిలీజ్ చేసి, మరింత ఆశ్చర్యానికి గురిచేశాడు.

ఎందుకుంటే, కల్కి సినిమాలో అమితాబ్ అమరుడిగా కనిపించనున్నారు. 2 డిఫరెంట్ గెటప్స్ వేశారు. వీటిలో యంగ్ అమితాబ్ లుక్ కూడా ఉంది. ఆ లుక్ ను కూడా గ్లింప్స్ లో చూపించారు. అది చూసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతయింది.

కల్కిలో అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. ఇదే నిజమైంది. "అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. నేను గురు ద్రోణాచార్య కొడుకు అశ్వద్ధామ." అంటూ బిగ్ బి డైలాగ్ చెప్పి అదృశ్యం అవ్వడం అదిరింది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.

అంతా బాగుంది కానీ, రిలీజ్ డేట్స్ పై స్పష్టత వస్తుందని ఎదురుచూసిన జనాల కోరిక మాత్రం నెరవేరలేదు. కేవలం బిగ్ బి క్యారెక్టర్ ను పరిచయం చేయడం వరకు మాత్రమే ఈ వీడియో పరిమితమైంది. విడుదల తేదీని ప్రకటించలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?