Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాకు, వాళ్లకు సంబంధం లేదు - అనసూయ

నాకు, వాళ్లకు సంబంధం లేదు - అనసూయ

ఇకపై వివాదాలకు దూరంగా ఉంటానని, ప్రశాంతంగా ఉంటానని అనసూయ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఉండాలనుకున్నా, సోషల్ మీడియాలో జనం మాత్రం ఆమెను ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేరు. విజయ్ దేవరకొండ విషయంలో మరోసారి అనసూయను లాగారు.

ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ పై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. తను మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వాడినని, బైక్ కు పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మిస్-ఫైర్ అయ్యాయి.

మిడిల్ క్లాస్ కుర్రాడి కథతో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్ కోసమే విజయ్ దేవరకొండ ఇలా మిడిల్-క్లాస్ కలరింగ్ ఇస్తున్నాడంటూ చాలామంది అతడిపై కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారంలోకి కొంతమంది అనసూయను లాగారు.

గతంలో విజయ్ దేవరకొండపై అనసూయ పరోక్షంగా వ్యాఖ్యలు చేసి, అతడి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఆమెపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గుర్రుగానే ఉన్నారు. ఇప్పుడీ కామెంట్స్ లోకి మరోసారి తనను లాగడంతో అనసూయ అప్రమత్తమైంది.

"ఎందుకు అస్తమానం నన్ను లాగుతారు. ఎవరు ఏ మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి చెప్పి వదిలేశాను. అనవసరంగా నేనే హైప్ ఇస్తున్నానని నావాళ్లు అంటుంటే నిజమేనేమో అని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. కానీ నాకు సింపతీ అక్కర్లేదు. నాకు నా మీద, నా దేవుడి మీద నమ్మకం. ఇప్పుడు ఈ పోస్టును కూడా తమ స్వార్థానికి వాడుకున్నా నేను ఆశ్చర్యపోను. కానీ నాకు వాళ్లకు ఎటువంటి సంబంధం లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు."

అనసూయ ఎప్పుడు ట్రోలింగ్ కు గురైనా, కొంతమంది ఆమెను ఆంటీ అంటూ ఏడిపించడం కామన్. ఈసారి కూడా అదే జరిగింది. ఎప్పట్లానే దీనిపై కూడా అనసూయ రియాక్ట్ అయింది. ఓ నెటిజన్ కు సున్నితంగా చురకలంటించింది.

"నాకు తెలిసి మీరు, నేను అస్సలు చుట్టాళ్లం కాదు. సో, నేను మీకు ఆంటీని కాదు. అయినా మీ ఇంట్లో అడగండి, మీకు తెలియకుండా ఏమైనా రిలేషన్స్ ఉన్నాయేమో. ఎందుకంటే నాకు చుట్టాలైతేనే ఆంటీ అనే పలకరింపు ఉంటుందని నాకు నా పెద్దవాళ్లు నేర్పించారు."

విజయ్ దేవరకొండ వివాదం నుంచి పూర్తిగా దూరం జరగాలని భావిస్తోంది అనసూయ. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట ఆమె ప్రస్తావన వస్తూనే ఉంది. తనకు, వాళ్లకు సంబంధం లేదంటూ అనసూయ క్లారిటీ ఇచ్చినా ఇది ఆగడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?