హీరో నాగశౌర్య- హీరోయిన్ రీతూ వర్మల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సినిమా వరుడు కావలెను.
ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఓ చిన్న విడియో బిట్ కూడా వదిలారు. కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య అందిస్తున్న సినిమా ఇది.
వరుడు కావలెను అనేకన్నా అందమైన వరుడు కావలెను అన్నంత అందంగా విడియోను కట్ చేసి వదిలారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లను ఇద్దరిని ఎంత అందమైన ఫ్రేమ్ ల్లో చూపించాలో అంత అందంగానూ చూపించారు.
అంతకు మించి విడియో బిట్ లో మరేమీ లేకున్నా, సినిమా జోనర్, రొమాంటిక్ లుక్స్, బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ కలిసి, డైరక్టర్ టేస్ట్ ను స్టామినాను చెబుతున్నాయి.
శౌర్యను చాలా అందంగా చూపించారు. అలాగే రీతూవర్మను కూడా విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన ఆర్ఆర్ స్మూత్ గా బాగుంది. గణేష్ రావూరి తొలిసారి గా ఈ సినిమాకు మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ సినిమా సంక్రాంతి వేళకు రెడీ అయిపోతుంది. అప్పడు పరిస్థితులను బట్టి రిలీజ్ డేట్ వుంటుంది.