టాలీవుడ్ లో ప్రస్తుతం లీడింగ్ హీరోయిన్. గీతగోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న భామ. అలాంటి ముద్దుగుమ్మకు ఒక్కసారిగా మహేష్ సరసన ఛాన్స్ వచ్చేసింది. దీంతో చాలామంది ఈ సెలక్షన్ పై పెదవి విరిచారు. చాలా కామెంట్స్ చేశారు. వాటిపై స్పందించాడు దర్శకుడు అనీల్ రావిపూడి.
“మహేష్ పక్కన రష్మిక వద్దని నాకు చాలామంది చెప్పారు. పర్సనల్ గా ఫోన్లు చేశారు. అమ్మాయిలు, నా చిన్నప్పటి ఫ్రెండ్స్ చాలామంది నాకు చెప్పారు. మహేష్ పక్కన ఈ అమ్మాయేంటి అన్నారంతా. కానీ ట్రయిలర్ చూసిన తర్వాత రష్మికను ఎందుకు తీసుకున్నానో చాలామందికి అర్థమైంది.”
నిజానికి తన కథకు పెద్ద హీరోయిన్ అవసరం లేదంటున్నాడు అనీల్ రావిపూడి. ఫిదా సినిమాలో సాయిపల్లవిని కాకుండా స్టార్ హీరోయిన్ ను తీసుకుంటే ఎలా ఉండేదో, తన సినిమాకు కూడా అలానే ఉండేదని స్పష్టంచేశాడు.
“పెద్ద హీరోయిన్ తో నేను సెట్స్ పైకి వెళ్తే అది పెద్ద మిస్టేక్ అయి ఉండేది. ఆ తప్పు నేను చేయలేదు. మాకు స్టార్ హీరోయిన్ వద్దు, ఓ క్యారెక్టర్ కావాలి. రష్మిక మంచి ఆర్టిస్ట్. ట్రయిన్ లో కర్నూలు వెళ్లే ఓ సాదాసీదా అమ్మాయి కావాలి. రష్మికను తీసుకోవడం ఓ మంచి నిర్ణయమని మహేష్ కూడా అన్నారు.”
ఈ సినిమాతో రష్మిక కెరీర్ లో నెక్ట్స్ లెవెల్ కు వెళ్తుందని చెప్పుకొచ్చాడు దర్శకుడు. ఆమెకు ఇచ్చిన “అర్థమౌతుందా” అనే ఊతపదం కేవలం కామెడీలోనే కాకుండా, అన్ని ఎమోషన్స్ లోనూ వస్తుందంటున్నాడు.