‘బ్రో’ టైటిల్ వదిలేయడానికి కారణం ఇదే!

బ్రో.. ఐ డోంట్ కేర్ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఒక టైమ్ లో సినిమాకు అదే టైటిల్ అనుకున్నారు కూడా. కానీ ఆ టైటిల్ నుంచి వెనక్కు తగ్గాడు అనీల్ రావిపూడి.…

బ్రో.. ఐ డోంట్ కేర్ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఒక టైమ్ లో సినిమాకు అదే టైటిల్ అనుకున్నారు కూడా. కానీ ఆ టైటిల్ నుంచి వెనక్కు తగ్గాడు అనీల్ రావిపూడి. బాలయ్య సినిమాకు ఫ్రెష్ గా భగవంత్ కేసరి అనే పేరు పెట్టి రిలీజ్ చేశాడు. ఆ క్రమంలో.. పవన్ సినిమా కోసమే అనీల్ రావిపూడి టైటిల్ వదులుకున్నాడనే ప్రచారం జరిగింది.

అయితే బాలయ్య సినిమాకు బ్రో అనే టైటిల్ పెట్టకపోవడం వెనక అసలు కారణాన్ని వెల్లడించాడు అనీల్ రావిపూడి. బాలయ్య సినిమాల్లో ప్రతిది పవర్ ఫుల్ గా ఉండాలని, అందుకే 'బ్రో' అనే సాఫ్ట్ టైటిల్ వదిలేశానన్నాడు.

“ముందు 'బ్రో' అనే టైటిలే పెడదాం అనుకున్నాం. కానీ బాలకృష్ణ సినిమా కావడంతో మరోసారి ఆలోచించాం. బాలయ్య సినిమాల్లో ప్రతిది పవర్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటారు జనం. అందుకే టైటిల్ కూడా ఇంకాస్త పవర్ ఫుల్ గా ఉండాలని ఆలోచించాం. అందుకే 'బ్రో' టైటిల్ ను కావాలనే వదులుకున్నాం. టైటిల్ లో పేరు ఉంటే ఎక్కువ రోజులు నలుగుతుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, శివ.. ఇలా పేర్లతో టైటిల్ పెడితే ప్రేక్షకులకు ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది. అందుకే భగవంత్ కేసరి అని పెట్టాం.”

ఇలా టైటిల్ మార్పు వెనక అసలు కారణాన్ని వెల్లడించాడు అనీల్ రావిపూడి. 'బ్రో' కాకుండా పెట్టే మరో టైటిల్ ఏదైనా మరింత స్పెషల్ గా ఉండాలనే ఉద్దేశంతో.. నేలకొండ భగవంత్ కేసరి (ఎన్బీకే) అని పెట్టానని వెల్లడించాడు.

ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది ఈ సినిమా. మూవీకి గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజూ బాలకృష్ణ, శ్రీలీల, అనీల్ రావిపూడిలో ఎవరో ఒకరు ప్రమోషన్స్ లో కనిపిస్తున్నారు.