తన క్యారెక్టర్ సర్ ప్రైజ్ అంటున్న హీరోయిన్

కార్తి హీరోగా నటించిన సినిమా జపాన్. త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కార్తి కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం. అందుకే ఈ సినిమాపై చాలా కేర్ తీసుకున్నాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.…

కార్తి హీరోగా నటించిన సినిమా జపాన్. త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కార్తి కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం. అందుకే ఈ సినిమాపై చాలా కేర్ తీసుకున్నాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే అంతకంటే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్.

కెరీర్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ.. జపాన్ సినిమా తనకు లైఫ్ ఇస్తుందని ఆశపడుతోంది. సినిమాలో తన పాత్ర అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని అంటోంది.

“జపాన్ లో నా పాత్ర ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంటుంది. దాని  గురించి ఇప్పుడే ఎక్కువగా రివిల్ చేయకూడదు. ఇందులో నటిగా కనిపిస్తాను. నా పాత్ర జపాన్ జీవితంలో కీలకంగా ఉంటుంది. కార్తి, నా పాత్రకు మధ్య చాలా ఆసక్తికరమైన ట్రాక్ ఉంటుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది.”

సినిమాలో కార్తితో పాటు, సునీల్ తో కూడా తనకు మంచి ట్రాక్ ఉందని అంటోంది అను ఎమ్మాన్యుయేల్. ఊర్వశివో రాక్షసివో సినిమాలో సునీల్ తో కలిసి పనిచేశానని, మళ్లీ ఇప్పుడు జపాన్ లో వర్క్ చేశానని అంటోంది.

త్వరలోనే తెలుగులో ఓ సినిమా చేస్తానని, ఆ వివరాలు త్వరలోనే మేకర్స్ బయటపెడతారని అంటోంది అను ఎమ్మాన్యుయేల్. తెలుగులో రవితేజ సరసన ఆమె చేసిన రావణాసుర సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. ప్రస్తుతం జపాన్ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది.