cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ గా మారిన సంగీత దర్శకుడు

బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ గా మారిన సంగీత దర్శకుడు

చిన్న సినిమా తీయాలి. కానీ దానికి పెద్ద హైప్ రావాలి. ఇలా ఆలోచించే ప్రతి మేకర్ అనూప్ రూబెన్స్ వైపు చూస్తున్నాడు. అవును.. మీడియం రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు ఈ సంగీత దర్శకుడు. మరీ ముఖ్యంగా బంగార్రాజు సినిమా ఇతడి కెరీర్ కు బాగా ప్లస్ అయింది.

బంగార్రాజులో పాటలు హిట్టవ్వడంతో పాటు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా క్లిక్ అయింది. దీంతో అనూప్ కు మరోసారి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా మరో కొత్త ప్రాజెక్టులోకి ఎంటరయ్యాడు ఈ సంగీత దర్శకుడు. అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ అందుకున్నాడు.

ఇంతకుముందు పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలతో దర్శకుడిగా అందరిని ఆకట్టుకున్న జయశంకర్.. మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంగీతం అందించే బాధ్యతను అనూప్ కు అప్పగించారు. 

నిజానికి ఈ సినిమా కోసం ఓ సీనియర్ సంగీత దర్శకుడ్ని అనుకున్నారు. కానీ తమ ప్రాజెక్ట్ కు అనూప్ అయితేనే ది బెస్ట్ అని భావించారు నిర్మాతలు ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి. చికాగోకు చెందిన వ్యాపారవేత్తలు వీళ్లిద్దరు.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ మ్యూజిక్ డైరక్టర్... జయశంకర్ సినిమాకు వర్క్ స్టార్ట్ చేశాడు. అనసూయ కోసం ఓ మంచి సాంగ్ కంపోజ్ చేసే పనిలో పడ్డాడు.

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?