Advertisement

Advertisement


Home > Movies - Movie News

వారంలో 3 సినిమాలు సైన్ చేసిన హీరోయిన్

వారంలో 3 సినిమాలు సైన్ చేసిన హీరోయిన్

తెలుగులో అనుపమ పరమేశ్వరన్ తొలి సినిమా ఏంటనేది అందరికీ తెలుసు. కానీ ఆ అవకాశం ఎలా వచ్చింది, ఆ తర్వాత జరిగిన కథేంటనేది చాలామందికి తెలియదు. రీసెంట్ గా తన మలయాళ, తెలుగు డెబ్యూ గురించి చెప్పుకొచ్చింది అనుపమ.

ఓ ప్రముఖ కాలేజీలో చదువుకోవాలనేది అనుమప ఆశ. దీని కోసం ఆమె తండ్రి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మరీ జాయిన్ చేశాడు. అలా జాయిన్ అయిన 2 నెలలకే మలయాళం ప్రేమమ్ లో అవకాశం వచ్చింది. అయితే తన పాత్ర ఉంటుందా, ఎడిటింగ్ లో తీసేస్తారా అనే అనుమానంతో ఎవ్వరికీ చెప్పలేదంట అనుపమ.

ఎప్పుడైతే పోస్టర్ లో తన ఫొటో కనిపించిందో అప్పుడిక నమ్మకం కుదిరిందట. ఆ సినిమా సక్సెస్ తర్వాత డిగ్రీ సెకెండ్ ఇయర్ లోకి ఎంటరైంది. సరిగ్గా అప్పుడే నిర్మాత నాగవంశీ నుంచి ఫోన్ వచ్చిందంట. ఆయన నేరుగా తీసుకెళ్లి త్రివిక్రమ్ ముందు కూర్చోబెట్టాడు. అలా అ..ఆ సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలిపింది

ఈ సందర్భంగా ఓ గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది అనుపమ. అ..ఆ సినిమాతో పాటు అదే వారంలో తెలుగులో మరో 2 సినిమాలు సైన్ చేసిందట. వీటిలో ఒకటి తెలుగు ప్రేమమ్ కాగా.. రెండోది దిల్ రాజు సినిమా.

దిల్ రాజు కోసం సైన్ చేసిన సినిమా ఆగిపోయిందట. దాంతో ఆమెను శతమానం భవతి సినిమాలోకి తీసుకున్నాడట దిల్ రాజు. అలా తెలుగులో తన ఎంట్రీ జరిగిందని, వారంలోనే 3 సినిమాలకు సైన్ చేశాననే విషయాన్ని బయటపెట్టింది అనుపమ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?