టాలీవుడ్ సినిమాల వ్యవహారం ఎక్కడిక్కడ ఆగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్ సీస్ లో కూడా థియేటర్లు మూత పడ్డాయి. షూటింగ్ లో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లు ఆగిపోయయి. అయితే మార్చి నెలాఖరు వరకే ఇప్పటికి వున్న ఆదేశాలు. కానీ ఈ ఆదేశాలు పొడిగించరు అన్న నమ్మకం అయితే లేదు. పొడిగించపోవచ్చు అన్న ఆశమాత్రం వుంది.
ఆ ఆశ సంగతి ఎలా వున్నా, మాల్స్, థియేటర్లు తెరచుకున్నా, సినిమాల విడుదలకు మార్గం అంత సులువుగా వుండదనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే తెలుగునాట థియేటర్ల వ్యవహారం ఎలా వున్నా, విదేశాల్లో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఇది ఒక సమస్య. ఇక తెలుగునాట మార్చిలో జరగాల్సిన పరిక్షలు అన్నీ ఏప్రియల్ కు వెళ్లిపోయాయి. అలాగే వివిధ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏప్రియల్ కే షెడ్యూలు అవుతున్నాయి. ఇది రెండో సమస్య.
అందువల్ల ఏప్రియల్ 15 వరకు సినిమాలను విడుదల చేసే ఆలోచన దాదాపు చేయడం లేదని తెలుస్తోంది. అలా అయితే దాదాపు సమ్మర్ లో రెండు వారాలు వదిలేసుకున్నట్లే. అప్పుడు కూడా విదేశీ మార్కెట్ మీద ఎక్కువగా ఆశలు లేని సినిమాలకు మాత్రమే. విదేశీ మార్కెట్ కావాలనుకున్న సినిమాలు మే దాకా వేచి వుండాల్సిందేనేమో?