కరోనా తగ్గుముఖం పట్టినా, దసరా, దీపావళి సీజన్లను కూడా సినిమాలు వదిలేసుకుంటున్నాయి. జనాలు వస్తారా? రారా? వచ్చినా ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ మీద సినిమాలు విడుదల చేయడం సాధ్యమేనా అన్న ఆలోచనతో అందరూ, 2021 సంక్రాంతి మీదే దృష్టి పెట్టారు.
ఇప్పటికే రంగ్ దే, బ్యాచులర్, అల్లుడు అదుర్స్, వకీల్ సాబ్ లాంటి సినిమాలు సంక్రాంతి టార్గెట్ గా ముస్తాబవుతున్నాయి.
ఇప్పుడు రానా దగ్గుబాటి 'అరణ్య' కూడా ఈ బరిలోకి దిగుతోంది. రంగ్ దే, బ్యాచులర్ అధికారికంగా ప్రకటించినట్లే అరణ్య యూనిట్ కూడా సంక్రాంతి విడుదల అంటూ ప్రకటించేసింది.
ఇక కాక ఇప్పటికే ముస్తాబై రెడీగా వున్న ఉప్పెన, సోలో బతుకు సినిమాలు వుండనే వున్నాయి.
మొత్తం రెడీ అయిన, రెడీ అవుతున్న సినిమాల్లో ఎన్ని ఓటిటికి వెళ్తాయో, ఎన్ని థియేటర్ కు వస్తాయో, సంక్రాంతి పోటీ ఎంత రంజుగా వుంటుందో చూడాలి.