అవును.. మేమిద్దరం విడిపోయాం

బాలీవుడ్ బాంబ్ షెల్ మలైకా అరోరా, నటుడు అర్జున్ కపూర్ విడిపోయారనేది ఓపెన్ సీక్రెట్. ఇద్దరూ ఒకర్నొకరు అన్-ఫాలో చేసుకున్నారు. ఇన్నాళ్లూ ఒకే ఫ్లాట్ లో సహజీవనం చేసిన ఈ జంట, కొన్ని నెలల…

బాలీవుడ్ బాంబ్ షెల్ మలైకా అరోరా, నటుడు అర్జున్ కపూర్ విడిపోయారనేది ఓపెన్ సీక్రెట్. ఇద్దరూ ఒకర్నొకరు అన్-ఫాలో చేసుకున్నారు. ఇన్నాళ్లూ ఒకే ఫ్లాట్ లో సహజీవనం చేసిన ఈ జంట, కొన్ని నెలల కిందట వేర్వేరు ఫ్లాట్స్ కు మారారు.

అయితే తామిద్దరం విడిపోయామనే విషయాన్ని వీళ్లు ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా మలైకా అరోరా తన తండ్రిని కోల్పోయింది. ఆ టైమ్ లో అర్జున్ కపూర్, ఆమెకు అండగా నిలిచాడు. అన్నీ తానై చూసుకున్నాడు. దాంతో వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారనే ప్రచారం నడిచింది.

అయితే తొలిసారి ఈ అంశంపై స్పందించాడు నటుడు అర్జున్ కపూర్. మలైకాతో తను విడిపోయిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. ముంబయిలో రాజ్ థాక్రే ఇచ్చిన దీపావళి పార్టీకి హాజరైన అర్జున్ కపూర్, ఆహుతుల్ని ఉద్దేశించి మాట్లాడేందుకు మైక్ తీసుకున్నాడు. వెంటనే అంతా మలైకా…మలైకా అని అరవడం మొదలుపెట్టారు. దీంతో తను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నానని, ఇక అంతా రిలాక్స్ అవ్వాలని ప్రకటించాడు.

అర్జున్ కపూర్ ప్రకటనతో మలైకాతో ఇతడి బంధం ముగిసిందనే విషయంపై క్లారిటీ వచ్చింది. 2018 నుంచి వీళ్లిద్దరూ డేటింగ్ మొదలెట్టారు. ఎన్నో ఫారిన్ ట్రిప్స్ వెళ్లొచ్చారు. కొన్ని నెలల కిందట విడిపోయారు.

సింగం ఎగైన్ సినిమాలో విలన్ గా నటించాడు అర్జున్ కపూర్. 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

5 Replies to “అవును.. మేమిద్దరం విడిపోయాం”

Comments are closed.