
ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు సీనియర్ నటుడు అశిష్ విద్యార్థి. ఆరు పదుల వయసులో అసోంకు చెందిన వ్యాపారవేత్త రూపాలి బారువాను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇవాళ ఉదయం కలకత్తాలో స్నేహితులు మరియు బంధువుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.
గతంలో అశిష్ బెంగాలీ నటి శకుంతలా బరువా కూతురు రాజోషి బరువాను పెళ్లి చేసుకున్నారు. మొదట భార్యతో కొడుకు కూడా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. అశిష్ కొడుకు కుడా రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
విలన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడుగా అశిష్ విద్యార్థి మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు దాదాపు 11 భాషల్లో, 300కు పైగా చిత్రాల్లో నటించారు. మహేశ్ బాబు నటించిన పోకిరి, ఆగడు, పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాలతో తెలుగులో పాపులర్ అయ్యారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా