నా ఫ్రెండ్ చెల్లెలు కథ ఈ అశ్వథ్థామ

తన స్నేహితుడి సిస్టర్ కు జరిగిన అనుభవం తనను కదిలించిందంటున్నాడు హీరో నాగశౌర్య. అశ్వథ్థామ కథ రాయడానికి అదే తనకు ప్రేరణ అని చెప్పుకొచ్చారు. తనను అంతలా కదిలించింది కాబట్టే స్టోరీ రైటర్ గా…

తన స్నేహితుడి సిస్టర్ కు జరిగిన అనుభవం తనను కదిలించిందంటున్నాడు హీరో నాగశౌర్య. అశ్వథ్థామ కథ రాయడానికి అదే తనకు ప్రేరణ అని చెప్పుకొచ్చారు. తనను అంతలా కదిలించింది కాబట్టే స్టోరీ రైటర్ గా మారానని చెప్పుకొచ్చాడు.

“మన చెల్లెలు, లవర్, అక్క, భార్య.. ఇలా ఎవరితోనైనా వేరే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తే మనకు కాలుతుంది. నాకు అలా కాలి ఈ సినిమా తీశాను. నా ఫ్రెండ్ చెల్లికి జరిగిన అవమానం, అనుభవమే ఈ స్టోరీ. నన్ను అదే కదిలించింది. అందుకే నేనే ఈ స్టోరీ రాశాను, నేనే ఈ సినిమా తీశాను.” 

ఖమ్మంలో జరిగిన సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన నాగశౌర్య.. సినిమాను చాలా నిజాయితీగా తీశామంటున్నాడు. అలా అని ఇది డాక్యుమెంటరీలా ఉండదని, ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటుందని అంటున్నాడు.

“సినిమా చాలా జెన్యూన్ గా తీశాం. అబ్బాయిలు, అమ్మాయిందరికీ కనెక్ట్ అవుతుంది. అలాగని సినిమా డాక్యుమెంటరీలా ఉండదు. మీకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంది. నర్తనశాల డిజాస్టర్ తర్వాత సినిమా నిర్మించమని మళ్లీ అమ్మను అడగడానికి మొహమాటం అడ్డొచ్చింది. కానీ సినిమా రాయాలని ఉంది కాన్ఫిడెన్స్ ఇమ్మని చెప్పాను. డబ్బులు పోయినా పర్వాలేదు, అనుకున్నది చేయమని అమ్మానాన్న సపోర్ట్ చేశారు.” 

జీవితంలో మళ్లీ నర్తనశాల లాంటి చెత్త సినిమాలు తీయనని వేదికపైనే ప్రకటించాడు నాగశౌర్య. తప్పుల నుంచి చాలా నేర్చుకున్నానని, తన నిజాయితీని గుర్తించాలని అందర్నీ కోరాడు.

నన్ను దిగిపొమ్మంటారా

'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' స్పెషల్ ఇంటర్వ్యూ