చంద్ర‌బాబు మహానీయుడు.. అశ్వినీద‌త్ శాపనార్థాలు!

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వంపై.. జగన్‌పై నిత్యం నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ.. పెద్ద పెద్ద నీతులు చెప్పే ప్రముఖ నిర్మాత అశ్వినీద‌త్ చంద్రబాబు అరెస్ట్‌పై కాస్త లేటుగా.. జగన్ ప్రభుత్వంను ఘాటుగా…

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వంపై.. జగన్‌పై నిత్యం నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ.. పెద్ద పెద్ద నీతులు చెప్పే ప్రముఖ నిర్మాత అశ్వినీద‌త్ చంద్రబాబు అరెస్ట్‌పై కాస్త లేటుగా.. జగన్ ప్రభుత్వంను ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప మహానీయుడని అరెస్టు చేయడం దుర్మార్గం అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు

ఇవాళ ఆయ‌న ఓ వీడియోలో మాట్లాడుతూ.. దేశానికి గొప్ప ప్ర‌ధానిని, స్పీక‌ర్‌ను, రాష్ట్ర‌ప‌తిని ఇచ్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుది అని.. అలాంటి నేత‌ను ద‌ర్మార్గంగా అరెస్ట్ చేశార‌ని.. ఆ మ‌హానీయుడుని అరెస్ట్‌కు కుట్ర ప‌న్నిన వారికి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని శాపనార్థాలు పెట్టారు. ప‌నిలో పనిలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ పార్టీ 160 సీట్లు గెలుస్తుంద‌ని జ్యోషం కూడా చెప్పారు.

కాగా తమ సామాజిక వ‌ర్గ‌ నేత అధికారంలో లేడని బాధ ఆయనలో నిత్యం కనపడుతూనే ఉంటుంది. అందులో కొత్త లేక‌పోయిన టీడీపీ పార్టీకి 160 సీట్లు వస్తాయనుకున్నప్పుడు నోటాతో పోటీప‌డే బీజేపీ, రెండు చోట్ల నిల‌బ‌డి ఓడిపోయిన జ‌న‌సేన ప‌వ‌న్ క‌ళ్యాణ్ చుట్టూ టీడీపీ ఎందుకు తిరుగుతుంద‌ని సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేత‌లు.

మ‌రోవైపు చంద్ర‌బాబు అరెస్ట్‌పై టాలీవుడ్ నుండి పెద్ద‌గా స్పంద‌న లేక‌పోయిన చంద్ర‌బాబు ద్వారా లబ్ధిపొందిన ఆయ‌న సామాజిక వ‌ర్గ డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు కొంత మంది అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. బ‌హుశా ముందు ముందు మిగ‌తా వారు కూడా చంద్ర‌బాబు కోసం కాక‌పోయిన త‌మ సామాజిక వర్గం కోసం అయిన ఖండ‌న‌లు రావ‌చ్చు.