అనుష్క.. శెట్టి..పోలిశెట్టి

హీరోయిన్ అనుష్క..క్రేజీ హీరో నవీన్ పోలిశెట్టి లను కలిపి యువి సంస్థ తీస్తున్న సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ బయటకు విడుదల చేసారు. ఆ మధ్య వచ్చిన స్వాతి ముత్యం సినిమా మాదిరిగానే ‘వీర్యదానం’…

హీరోయిన్ అనుష్క..క్రేజీ హీరో నవీన్ పోలిశెట్టి లను కలిపి యువి సంస్థ తీస్తున్న సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ బయటకు విడుదల చేసారు. ఆ మధ్య వచ్చిన స్వాతి ముత్యం సినిమా మాదిరిగానే ‘వీర్యదానం’ అనే పాయింట్ తో నడచే కథ అని తెలుస్తోంది. 

హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ అనుష్క శెట్టి పేర్లు కలిసి వచ్చేలా ‘శెట్టి..పోలిశెట్టి’ అనే టైటిల్ పిక్స్ చేసారు. ఇంట్రస్టింగ్ గానే వుంది టైటిల్. పేర్ల ముందు మిస్..మిస్టర్ అని తగిలించారు.

హీరోయిన్ కు అమెరికా బ్యాక్ డ్రాప్, హీరోకు హైటెక్ సిటీ బ్యాక్ డ్రాప్ చూపించారు. ఇద్దరినీ ఏం కలిపింది, ఎలా టర్న్ తీసుకుంది అన్నది కథ. సినిమాను ఈ సమ్మర్ లో విడుదల చేస్తున్నామని ప్రకటించారు. కానీ ఇంకా డేట్ అన్నది ఇవ్వలేదు. ఫన్ రైడ్ అని చెప్పేసారు. నవీన్ పోలిశెట్టి వున్నాడు కనుక ఫన్ కు లోటు వుండదు. అనుష్క తెరమీద కనిపించి చాలా రోజులయింది.

అందువల్ల ఈ ప్రాజెక్టుకు కాస్త క్రేజ్ కచ్చితంగా వుంటుంది. ఈ సినిమాలో నవీన్,  సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్ గా, అనుష్క అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌ పాత్రలో నటించారు. మహేష్‌ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది.

టైటిల్ తోనే మంచి అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ వేసవికి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోంది.