సీనియర్ హీరోల మార్కెట్ రాను రాను తగ్గుతోంది. అది వాస్తవం. నాగ్, వెంకీ, బాలయ్య ల్లో వాస్తవానికి దగ్గరగా వచ్చి, వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నవారు నాగ్, వెంకీ మాత్రమే. కానీ బాలయ్య మాత్రం ఇంకా తన స్టయిల్ 'దబిడి దిబిడి' సినిమాలే చేస్తున్నారు.
అలాగే ఈ ముగ్గురిలో బాలయ్యే రెమ్యూనిరేషన్ విషయంలో ఇంకా ఏమాత్రం తగ్గకుండా అదే గీత మీద వుండిపోయినట్లు తెలుస్తోంది. తొమ్మిది నుంచి పది కోట్లు ఇస్తేనే సినిమా చేయడం. లేదంటే లేదు. అనే నియమంతోనే బాలయ్య ఇప్పటికీ వుండిపోయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అతి కష్టం మీద బోయపాటి ప్రాజెక్టు స్టార్ట్ అయింది. బాలయ్య మరో ఒకటి రెండు స్క్రిప్ట్ లు ఓకె చేసినట్లు తెలుస్తోంది. కానీ వాటికి నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రావడం లేదని టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం బాలయ్య రెమ్యూనిరేషన్ నే అని అంటున్నారు. బాలయ్య తొమ్మిది నుంచి పది కోట్లు ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారని వినికిడి.
ఈ సినీయర్ల తరువాత వచ్చిన రవితేజ కూడా గతంలో ఇలాగే వుండేవారు. కానీ ఆయన ఈ మధ్య కాస్త తగ్గి ప్రాఫిట్ షేరింగ్ కు దిగారని బోగట్టా. మెగాస్టార్ బయట సినిమాలు చేయడం లేదు కాబట్టి, రెమ్యూనిరేషన్ లెక్కలు తెలియవు.