హీరోలంతా వరుసగా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తున్నప్పుడే ఎక్కడో ఓ చోట క్లాష్ తప్పదని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే నాగచైతన్య, నాని సినిమాలు క్లాష్ అయ్యాయి. లవ్ స్టోరీ, టక్ జగదీశ్ సినిమాలు రెండూ ఒకే తేదీని లాక్ చేశాయి. దిల్ రాజు లాబీయింగ్ తోనే ఇలా జరిగిందనే ప్రచారంతో, ఓవైపు ఈ లొల్లి కొనసాగుతుండగానే ఇప్పుడు మరో నిప్పు రాజుకునేలా ఉంది.
ఇప్పుడు బాలకృష్ణ, రవితేజ సినిమాల మధ్య పోటీ మొదలైంది. ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను మే 28న రిలీజ్ చేయబోతున్నట్టు కొన్ని రోజుల కిందట ప్రకటించాడు. ఇప్పుడు అదే తేదీని తాపీగా బాలకృష్ణ కూడా ప్రకటించాడు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా (ఇంకా పేరుపెట్టలేదు) చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీని మే 28న రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. దీంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు ఇప్పుడు చర్చల్లో పడ్డారు.
రవితేజ సినిమా యూనిట్ ఏం ఆలోచించి రిలీజ్ డేట్ లాక్ చేసుకుందో కానీ, బాలయ్య మాత్రం ముహూర్తం ఫిక్స్ చేసి మరి రిలీజ్ డేట్ పెట్టి ఉంటారు. కాబట్టి బాలయ్య సినిమా రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గే ఛాన్స్ లేదు. దీంతో ఇప్పుడు రవితేజ సినిమా డైలమాలో పడింది.
క్రాక్ ఊపుమీదున్న రవితేజ, ఖిలాడీ సినిమాతో బాలయ్యపై పోటీకి దిగుతాడా.. లేక వెనక్కి తగ్గుతాడా అనేది చూడాలి.