Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫ్యాన్ వార్స్ ఆర్ఆర్ఆర్ పై ప్రభావం చూపిస్తాయా..?

ఫ్యాన్ వార్స్ ఆర్ఆర్ఆర్ పై ప్రభావం చూపిస్తాయా..?

ప్రస్తుతం నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే సందర్భం. బాలయ్య కౌంటర్, దానికి నాగబాబు చేసిన ఎన్ కౌంటర్ ఓ రేంజ్ లో రచ్చ లేపుతున్నాయి. సోషల్ మీడియాలో నాగబాబుపై తిట్ల దండకం అందుకున్నారు నందమూరి అభిమానులు. అటు బాలయ్యని కూడా ట్రోల్ చేసి పడేస్తున్నారు మెగా ఫ్యాన్స్. గతంలో లేపాక్షి ఉత్సవాల సందర్భంలో కూడా ఇలాగే మెగా ఫ్యాన్స్ ని గిల్లి చెడామడా తిట్టించుకున్నారు బాలయ్య. అప్పుడు కూడా నాగబాబు చిరంజీవికి సపోర్ట్ గా మాట్లాడారు. పాత తరానికి చెందిన ఓ కమెడియన్ బాలయ్యని ఈ జనరేషన్ కి పరిచయం చేశారు కూడా.

ఇప్పుడు మేటర్ ఇంకాస్త సీరియస్ గా ఉంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ లు చేసుకుంటున్నారంటూ బాలకృష్ణ నిరాధారమైన అడ్డగోలు ఆరోపణలు చేశారు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగేలా లేదు.. రేపు ఎలాగూ బాలకృష్ణకు సపోర్ట్ గా మాట్లాడాలంటూ ఎన్టీఆర్ పై ఒత్తిడి పెరగొచ్చు, అసలే ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతోంది. అందులో మెగా ఫ్యామిలీ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు  ఎన్టీఆర్. అదే ఇక్కడ సమస్య.

ఆర్ఆర్ఆర్ తో మెగాభిమానులు, నందమూరి అభిమానులు కలిసిపోతారని రాజమౌళి భావించాడు. కొంతమేర అది జరిగింది కూడా. కానీ బాలయ్య స్టేట్ మెంట్ తో మొత్తం మంటగలిసిపోయింది. మరోసారి నందమూరి-మెగా ఫ్యాన్ వార్ మొదలైంది. ఈ గొడవ చినికి చినికి గాలివానై ఈ ప్రెస్టీజియస్ మూవీపై పడుతుందేమోనని రాజమౌళి టెన్షన్. ఇప్పటికే కరోనాతో ప్రాజెక్టు అగమ్యగోచరంగా తయారైంది. భారీ వసూళ్లు, బాహుబలి కలెక్షన్లు కొట్టేయాలి లాంటి ఆశలు ఎప్పుడో వదులుకున్నారు. ఇప్పుడు దీనికి ఫ్యాన్ వార్ తోడైతే ప్రాజెక్టుకు మరింత నష్టం.

గతంలో బాలయ్య సృష్టించిన వివాదాలతో ఎన్టీఆర్ కు పెద్దగా సంబంధం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్లిద్దరికీ అప్పట్లో పడేది కాదు. కానీ హరికృష్ణ మరణం తర్వాత సంబంధాలు బాగా బలపడ్డాయి. ఎన్టీఆర్-బాలయ్య పలు సందర్భాల్లో కలుసుకున్నారు. మనసువిప్పి మాట్లాడుకున్నారు. కాబట్టి బాలయ్య సృష్టించిన ఈ తాజా వివాదంపై కచ్చితంగా ఎన్టీఆర్ స్పందించాల్సిందే. ఇప్పటికిప్పుడు తారక్ దొరక్కపోయినా, ఆర్ఆర్ఆర్ పబ్లిసిటీ టైమ్ లోనైనా మీడియా ఈ వ్యవహారాన్ని కదులుపుకుంది.

అటు రామ్ చరణ్ కు మాత్రం తారక్ తో పోలిస్తే ఇలాంటి విషయాల్లో కాస్త అనుభవం ఉంది. ఎందుకంటే, గతంలో పవన్ కల్యాణ్, చిరంజీవికి సంబంధించి వచ్చిన వివాదాల్ని రామ్ చరణ్ ఫేస్ చేశాడు. ఇంకా చెప్పాలంటే గతంలో పవన్ పై వచ్చిన కాంట్రవర్సీలతో పోల్చి చూస్తే, తాజా వివాదం చాలా చిన్నది. కాబట్టి చరణ్ ఈజీగానే గట్టెక్కేస్తాడని అనుకోవాలి.

హీరోలిద్దరూ ఈ వివాదాన్ని ఎలా ఫేస్ చేస్తారనే విషయాన్ని పక్కనపెడితే... ఆర్ఆర్ఆర్ కు ఈ సెగ తగలకుండా ఎలా జాగ్రత్తపడతారనేది ఇక్కడ కీలకమైన అంశం. ఒకవేళ ఎక్కడైనా తేడా కొడితే మాత్రం సినిమా వివాదాల్లోకి వచ్చినట్టే లెక్క. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ పై బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలు పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు. 

అసలు విషయం మర్చిపోయిన చంద్రబాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?