బాలయ్య..అన్ స్టాపబుల్ షూట్

యంగ్ హీరోలు కథలు దొరక్క అల్లాడుతున్నారు. దొరికినా నెలకు వారం రోజులు షూట్ చేయడానికి కిందా మీదా అవుతున్నారు. కానీ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లు మాత్రం నాన్ స్టాప్ గా షూటింగ్…

యంగ్ హీరోలు కథలు దొరక్క అల్లాడుతున్నారు. దొరికినా నెలకు వారం రోజులు షూట్ చేయడానికి కిందా మీదా అవుతున్నారు. కానీ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లు మాత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ లు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ 107 వ సినిమా సెట్ మీద ఉండగానే 108వ సినిమాను స్టార్ట్ చేసేస్తున్నారు. అది కూడా కేవలం పూజ‌ కాదు ఏకంగా షూటింగ్ నే.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించే ఈ సినిమాను డిసెంబర్ 8న ఏకంగా షూటింగ్ తోనే ప్రారంభించేస్తున్నారు. రాజీవన్ సారథ్యంలో తయారు చేస్తున్న ఓ భారీ జైలు సెట్ లో షూట్ ప్రారంభిస్తారు. 

డిసెంబర్ 8 నుంచి 18 వరకు ఈ షూట్ వుంటుంది. 19 నుంచి వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ మీదకు వెళ్తారు. అక్కడ పది రోజులు షూటింగ్ లో పాల్గొని మళ్లీ అనిల్ రావిపూడి సినిమా మీదకు వస్తారు.

అనిల్ రావిపూడి-బాలయ్య సినిమాలో విలన్ గా ఇప్పటికే అర్జున్ రాంపాల్ ను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన స్టార్ కాస్ట్ ను ఎంపిక చేసే పనిలో వున్నారు నిర్మాత సాహు.