Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరో రవితేజను నేను మోసం చేయలేదు

హీరో రవితేజను నేను మోసం చేయలేదు

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పై ఎన్ని మీమ్స్, ఎన్ని కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయో.. అంతే స్థాయిలో వివాదాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొంతమంది నటుల్ని, దర్శకుల్ని ఆయన మోసం చేశాడనే ప్రచారం కూడా ఉంది. వీటిపై మరోసారి స్పందించారు బండ్ల. తను ఎవ్వర్నీ మోసం చేయలేదంటున్నారు.

"నేను తప్పుడు స్థలం అమ్మినట్టు ఎవరైనా నా ముందుకొచ్చి చెప్తే, దేనికైనా రెడీ. రవితేజ, కృష్ణవంశీ నా దగ్గర పొలాలు కొనుక్కున్నారు, తర్వాత అమ్ముకున్నారు. మేం వ్యాపారాలు చేశాం. కృష్ణవంశీ, రవితేజతో నాకు ఎలాంటి వివాదాల్లేవ్. సాయంత్రం పనీపాట లేకుండా సినిమా ఆఫీస్ లో కూర్చొని కబుర్లు చెప్పుకునే బ్యాచ్ ఇలాంటివి పుట్టిస్తుంటారు."

ఇలా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు బండ్ల. తనకు సినిమా మాత్రమే లైఫ్ కాదంటున్న ఈ నటుడు.. ఇండస్ట్రీలో తనకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో, రాజకీయ రంగంలో కూడా అంతేమంది సన్నిహితులున్నారని.. అందర్నీ కలుస్తుంటానని చెప్పుకొచ్చారు.  

"సినిమానే నా లైఫ్ కాదు. నా వ్యాపారం చేసుకుంటాను. నా జీవితంలో సినిమా ఒక భాగం. నా జీవితమే సినిమా కాదు. అందుకే నేను ఎలాంటి కబుర్లు, యవ్వారాలు పెట్టుకోను. నా జీవితం వేరు, నా సర్కిల్ వేరు, నా పనులు వేరు. నేను ఎవ్వర్నీ మోసం చేయలేదు. చెయ్యను కూడా. ఎదుటి వ్యక్తి అలా అనుకుంటే నేనేం చేయలేను."

ఎన్టీఆర్ బయోపిక్, జయలలిత బయోపిక్ తీసినట్టు.. తన జీవితాన్ని కూడా ఓ బయోపిక్ గా తీయొచ్చంటున్నారు బండ్ల. తన జీవితంలో కూడా ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు, కష్టాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతానికైతే మూవీ ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టలేదంటున్న ఈ నటుడు.. తను తొలిసారి లీడ్ రోల్ లో చేసిన డేగల బాబ్జీ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?