ఎప్పుడో అయిదారేళ్ల క్రిందట విడుదలయింది తమిళంలో 'ముందాసుపట్టి' అనే చిన్న సినిమా. ఇప్పుడు ఆ సినిమా పేరు మళ్లీ పైకి వచ్చింది. కారణం మరేం లేదు.
ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను భవ్య క్రియేషన్స్ సంస్థ కొనుగోలు చేయడమే. ఇదో చిన్న సినిమా. మినిమమ్ బడ్జెట్ లో తీసుకోగలిగిన సినిమా. అసలు ఆ సినిమానే ఓ షార్ట్ ఫిలిమ్ ను ఎక్స్ పాండ్ చేసి తయారుచేసారు.
అందుకే తెలుగులో రీమేక్ చేసి అయితే ఓటిటిలో లేదా థియేటర్లలోకి పంపేయవచ్చు అన్నది భవ్య ప్లాన్ లా కనిపిస్తోంది. వాస్తవానికి సినిమాలో ఇంట్రస్టింగ్ పాయింట్ వుంది.
ముందాసుపట్టి అనే ఊరిలో జనాలకు మూఢనమ్మకం. ఫొటో తీయించుకుంటే అరిష్టం అని, చావు వెంటాడుతుందని. ఇలా రకరకాలుగా. అలాంటి ఊళ్లోకి ఫోటోగ్రాఫర్ అయిన హీరో, అతని అసిస్టెంట్ ఓ అసైన్ మెంట్ మీద ప్రవేశిస్తే…..అదీ వ్యవహారం.
యంగ్ హీరోల్లో మిడ్ రేంజ్ లో వున్నవారు ఎవరితో అయినా ఈ సినిమా చేయాలని ప్లాన్ చేస్తోంది భవ్య.