భయం సినిమా మీదా? జనాల మీదా?

కరోనా తరువాత సినిమాలు చకచకా పరుగులు పెడుతున్నాయి. వారం వారం సినిమాల మీద సినిమాలు వచ్చి పడుతున్నాయి. ఒక్కోవారం మూడు, అయిదు, పది సినిమాలు విడుదలవుతున్నాయి.  Advertisement ఈ నెల, వచ్చేనెల, ఆపై వచ్చేనెల…

కరోనా తరువాత సినిమాలు చకచకా పరుగులు పెడుతున్నాయి. వారం వారం సినిమాల మీద సినిమాలు వచ్చి పడుతున్నాయి. ఒక్కోవారం మూడు, అయిదు, పది సినిమాలు విడుదలవుతున్నాయి. 

ఈ నెల, వచ్చేనెల, ఆపై వచ్చేనెల ఇలాగే వుంది పరిస్థితి. కానీ కొంతమందికి మాత్రం సోలో డేట్ దొరుకుతోంది. సరే ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి భారీ మల్టీ స్టారర్ లకు దారిచ్చేసారు అంటే అర్థం వుంది. కొన్ని ఓ రేంజ్ కు మాత్రమే చేరతాయి అనుకునే సినిమాలకు కూడా సోలో డేట్ దొరుకుతోంది. 

ఏప్రియల్ 9న వకీల్ సాబ్ వుంది. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి మాగ్జిమమ్ థియేటర్లు వేస్తారు. అర్థం చెసుకోవచ్చు. కానీ అలా అని మొత్తం నూరు శాతం థియేటర్లలో పరిచేయరు కదా? మరో సినిమా వేసుకోవచ్చు కదా? టాలీవుడ్ జనాలు ఏమంటారు. పెద్ద సినిమాలు రెండు ఎప్పుడైనా వేసుకోవచ్చు. మన దగ్గర ఆ స్కోప్ వుంటుంది అని. మరి వకీల్ సాబ్ కు సోలో గా ఎందుకు వదిలేసినట్లు?

నాలుగింట మూడు వంతులు సినిమాలు దిల్ రాజు ద్వారానే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. వకీల్ సాబ్ ఆయన స్వంత సినిమా. మరి అందుకే ఎవ్వరూ ఏ సినిమా విడుదల చేయడం లేదా? లేదా పవన్ కళ్యాణ్ సినిమా అని జంకి విడుదల చేయడం లేదా?  అలాగే మరో ఏస్ డిస్ట్రిబ్యూటర్ ఏసియన్ సునీల్ లవ్ స్టోరీకి కూడా సోలో డేట్ దొరికింది. అలాగే దిల్ రాజు మాజీ భాగస్వామి లక్ష్మణ్ చేతిలో వున్న టక్ జగదీష్ కు కూడా సోలో డేట్ దొరికింది.

ఇలా డిస్ట్రిబ్యూషన్లు చేతలో వున్న ముగ్గురికి తప్ప మరెవరికి సోలో డేట్ లు దొరకడం లేదు. ఇదే టాలీవుడ్ లో చిత్రమైన  పరిస్థితి. మిగిలిన వారంతా వేరే డేట్ లకు వేసుకుని కలెక్షన్లు షేర్ చేసుకోవాల్సిందే.

ఈ సినిమా నా జీవితంలో ఒక ఆణిముత్యం

దమ్ముంటే మోదీని ప్రశ్నించు..