భీమ్..భీమ్..భీమ్లా..నాయక్

పవన్ కళ్యాణ్ – రానా ల అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ భీమ్లానాయక్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది. గత రెండు రోజులుగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్న ఈ సాంగ్ బయటకు వచ్చింది.  Advertisement హీరోయిజమ్…

పవన్ కళ్యాణ్ – రానా ల అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ భీమ్లానాయక్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది. గత రెండు రోజులుగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్న ఈ సాంగ్ బయటకు వచ్చింది. 

హీరోయిజమ్ ను ఆకాశానికి ఎత్తుతూ సాగిన ఈ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రాసారు. ధమన్ డిఫరెంట్ ఇనుస్ట్రుమెంటేషన్ తో, మల్టిపుల్ సింగర్స్ తో సాంగ్ ప్రెజెంట్ చేసాడు. 

వినగానే భీమ్..భీమ్..భీమ్లా నాయక్ అన్న హుక్ లైన్ అయితే పట్టుకుంటుంది. అయితే అలా అని గతంలో వచ్చిన పలు ఇంట్రడక్షన్ సాంగ్ ల మాదిరిగా ఇన్ స్టాంట్ గా పట్టుకోదు. కాస్త టైమ్ పడుతుంది. 

పాట కోసం పిక్చరైజ్ చేసిన కవర్ సాంగ్ బాగుంది. అడవుల బ్యాక్ డ్రాప్ లో కవర్ సాంగ్ పిక్చరైజ్ చేయడం వల్ల అందం వచ్చింది. రామ్ జోగయ్య కొత్త పద ప్రయోగం..లాఠీ గాయక్…అదో మాదరి. అంతే.