సాధారణంగా ఏ సినిమా అయినా విడుదల దగ్గర పడితే ప్రచారానికి ఓ ప్రాసెస్ వుంటుంది. నిర్మాత మీడియాతో మాట్లాడడం, దర్శకుడు మీడియా ముందుకు రావడం, హీరోలు మీట్ లు పెట్టడం ఇలా. అది ఎంత చిన్న సినిమా అయినా, ఆర్ఆర్ఆర్ లాంటి ఎంత పెద్ద సినిమా అయినా సేమ్ ప్రాసెస్. ఇప్పటికే దర్శకుడు రాఙమౌళి ఒకటికి రెండు సార్లు మీడియా ముందుకు వచ్చారు. హీరోలు చరణ్, ఎన్టీఆర్ కూడా ఇంట్రాక్ట్ అయ్యారు.
కానీ భీమ్లా నాయక్ సినిమాకు మాత్రం పూర్తిగా ‘నో పబ్లిసిటీ’ పద్దతిని అవలంబిస్తున్నారు. విడుదలకు ముందు యూనిట్ లో ఎవ్వరూ మీడియా ముందుకు రారు. పవన్ కళ్యాణ్ ఎలాగూ ఎప్పుడూ రారు. ఇక సినిమాకు ఒక దర్శకుడు కాదు. దర్శకుడిగా టైటిల్ కార్డ్ సాగర్ ది. కానీ కథ, స్క్రీన్ ప్లే, క్వాలిటీ చెక్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా త్రివిక్రమ్. ఆయనే ముంబాయిలో స్వయంగా దగ్గర వుండి పనులు చూసుకుంటున్నారు. కానీ అలా అని దర్శకుడు కాకుండా ఆయన నేరుగా మీడియా ముందుకు రాలేరు.
ఇక మిగిలింది థమన్, సాగర్. థమన్ మిక్సింగ్ పనుల్లో బిఙిగా వున్నారు. ఏ మాత్రం పక్కకు జరిగినా ఓవర్ సీస్ ప్రీమియర్లు సమస్యలో పడతాయి. అందుకని ఆయన ఆ హడావుడిలో వున్నారు. ఇక మీడియా ముందుకు రావాల్సింది..ఆ అవసరం వున్నదీ కేవలం సాగర్ కు మాత్రమే. నిఙానికి ఈ సినిమా సాగర్ కు రావడం అంటే అది చాలా పెద్ద చాన్స్.
ఏనాడో చిన్న సిన్మా చేసాక మళ్లీ ఇన్నాళ్లకు ఇంత పెద్ద చాన్స్ వచ్చింది. కనీసం తాను చేసాను అని కాస్త హడావుడి చేసుకోవాలి. కానీ అది కూడా చేసుకోకుండా సాగర్ ను కట్టడి చేసినట్లు కనిపిస్తోంది.
ఇంతకీ రేపు సినిమా హిట్ అయితే అంతా తివిక్రమ్ టాలెంట్ అంటారో…లేక సాగర్ కు కాస్తయినా వాటా ఇస్తారో? అలాగే రేపు అదృష్టం బాగోలేకపోతే తివిక్రమ్ కాస్తయినా వాటా తీసుకుంటారో? మొత్తం సాగర్ అక్కౌంట్ లోకి తోసేస్తారో? చూడాలి. ప్రస్తుతానికి అయితే సాగర్ ..మీడియాకు..దూరం..దూరం.