నాయక్..భీమ్లా నాయక్ అనగానే..సిద్దూ సిద్దార్ధరాయ్ అని వినిపిస్తే వినిపించి వుండొచ్చు..గుర్తోస్తే గుర్తొచ్చి వుండొచ్చు. కానీ అలా గుర్తుకు వచ్చింది అంటే హీరో పవన్ కళ్యాణ్ ఫ్యానిజం మీలో ఇంకా దాగి వుందన్నమాట. అజ్ఞాత వాసి బూమరాంగ్ తరువాత పాలిటిక్స్ లోకి వెళ్లి వెనక్కు వచ్చిన పవన్ కళ్యాణ్ రెండో సినిమా 'భీమ్లా నాయక్'. అలాగే వకీల్ సాబ్ తరువాత చేస్తున్న రెండో రీమేక్.
పవన్ సచివుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ (ఇది అఫీషియల్ కాదు) అందిస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఓ చిన్న గ్లింప్స్ వదిలారు. లుంగీతో చకచకా నడుస్తూ వచ్చిన పవన్ పవర్ ఫుల్ మాస్ హీరోయిజం చూపించే చిన్న సీన్ ను కట్ చేసి గ్లింప్స్ గా వదిలారు. దాంతో పాటే ఓ పవర్ ఫుల్ డైలాగు కూడా.
అయితే అదంతా పవన్ కళ్యాణ్ మార్క్. మరి త్రివిక్రమ్ మార్కు? అదీ వుంది. భీమ్లా..భీమ్లా నాయక్..ఏంటీ కింద ఏదీ లేదని (డిజిగ్నేషన్) చూస్తున్నావా..అవసరం లేదు కానీ బండెక్కు…ఇదీ త్రివిక్రమ్ మార్కు. మొత్తం మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ గ్లిమ్స్ కచ్చితంగా పూనకాలే.
తెలుగులో టాప్ హీరోలకు ఎవరికి వారికే భయంకరమైన ఫ్యాన్ బేస్ వుంది. ఎన్టీఆర్-చరణ్ దోస్తీ సాంగ్ వచ్చింది. మహేష్ వీడీయో వచ్చింది. బన్నీ సాంగ్ వచ్చింది. ఇప్పుడు పవర్ గ్లింప్స్ వచ్చింది. తెలుగునాట ప్రతి ఫ్యాన్స్ ఇప్పుడు హ్యాపీయే. రాధేశ్యామ్ ప్రభాస్ ఫ్యాన్స్ తప్ప..వాళ్లనెప్పుడు హ్యాపీ చేస్తారో? యువి అధినేతలు.