Advertisement

Advertisement


Home > Movies - Movie News

భోళా..ఆ పాటేంటి..ఆ ట్యూనేంటీ?

భోళా..ఆ పాటేంటి..ఆ ట్యూనేంటీ?

భోళా అంటే భోళా శంకర్. ఈ సినిమా పబ్లిసిటీ స్టార్ట్ అయింది. ఆగస్ట్ లో విడుదల కావడంతో ముందుగా ఓ పాట విడుదల చేసారు. భోళాశంకర్ సినిమా కోసం రామజోగయ్య రాసిన బృంద గీతానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ‘అదిరే స్టయిలయ్యా..పగిలే స్వాగయ్యా..యుఫోరియా నా ఏరియా..భోళా మేనియా’ అంటూ మొదలయింది సాంగ్. ఎగస్ట్రాలు..కొలెస్ట్రాలు..గూబ గుయ్యనడాలు లాంటి రెగ్యులర్ ఫార్మాట్ పదాలు వాడారు.

పాట మొత్తం అటు మాస్ కు అలవాటైన దేవీశ్రీప్రసాద్ స్టయిల్ ను ఇమిటేషన్ చేసే ప్రయత్నం కనిపించింది. మహతి స్వర సాగర్ కు ఇలాంటి మాస్ పాటలు చేయడం కన్నా, మంచి మెలోడీ లేదా క్లాస్ సాంగ్ లు చేయడంలో పేరుంది. ఇలాంటి మాస్ సాంగ్ కోసం దేవీ ట్యూన్ లను రిఫరెన్స్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అది అటు ఇటు కాకుండా తయారైంది.

శేఖర్ మాస్టర్ డ్యాన్స్ డైరక్షన్ అంటే వాల్తేర్ వీరయ్యలోని సూపర్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. కానీ వాటి స్థాయిలో లేదు ఈ పాట. ప్రస్తుతానికి వదిలింది విడియోసాంగ్ కాదు కనుక మెగా స్టెప్ట్ ను పూర్తిగా చూసే అవకాశం లేదు. కానీ మాస్..ఊర మాస్..వీర మాస్ అంటూ చేసిన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను అలరిస్తుందేమో చూడాలి.

అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుశాంత్ ఓ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. కీర్తి సురేష్ మెగా స్టార్ చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?