టీవీ9 నుంచి బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి ఎందుకు బయటకొచ్చేశాడనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఎక్స్ క్లూజివ్ గా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి ఫొటోని వాడినందుకు, తండ్రి గురించి గొప్పగా చెప్పినందుకు మేనేజ్ మెంట్ కు కోపం రావడం వల్లనే బిత్తిరి సత్తి ఆ ఛానెల్ నుంచి బయటకొచ్చేశాడు.
అలా టీవీ9 నుంచి బయటకొచ్చిన సత్తి, సాక్షి ఛానెల్ లో చేరిన విషయాన్ని కూడా గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఇప్పుడిదే సాక్షి ఛానెల్ వేదికగా టీవీ9పై సెటైర్లు స్టార్ట్ చేశాడు సత్తి. తన తొలి కార్యక్రమాన్నే టీవీ9పై పంచ్ లకు వాడుకున్నాడు.
ఏ ఫాదర్స్ డే కార్యక్రమం వల్ల తను టీవీ9 నుంచి బయటకొచ్చాడో.. అదే ఫాదర్స్ డే కాన్సెప్ట్ తీసుకొని ప్రోమో రెడీ చేశాడు సత్తి. తండ్రిని గౌరవించే ఛానెల్ కు వచ్చానని పరోక్షంగా చెప్పిన సత్తి.. ఇకపై గుండీలు విప్పి తిరుగుతానని ప్రోమో “సాక్షి”గా వెల్లడించాడు.
సాక్షిలో చేరిన సత్తి తొలి ప్రోమోకే టీవీ9పై ఈ రేంజ్ లో విమర్శలు గుప్పించాడంటే.. రాబోయే రోజుల్లో తన కసిని, క్రియేటివిటినీ ఆ ఛానెల్ పై మరింత చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే సత్తి స్పెషల్ ప్రొగ్రామ్ సాక్షిలో ప్రసారం అవుతుంది.