బాలీవుడ్ నటుడు కుశాల్ టాండన్ జర్నలిస్టులపై మండిపడుతున్నాడు. ఇదా జర్నలిజం అంటూ ప్రశ్నిస్తున్నాడు. తనను ఆ వార్త షాక్‌కు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకూ కుశాల్‌ను అంతగా ఇరిటేట్ చేసిన ఆ వార్తా కథనం ఏంటో తెలుసుకుందాం.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో నటి అంకిత లోఖండే ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అప్పట్లో ఈ ప్రేమ పక్షుల వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆ తర్వాత ఏమైందో కానీ, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. విడిపోయారు. సుశాంత్‌తో కటీఫ్ చెప్పిన తర్వాత కుశాల్ టాండన్, అంకిత చెట్టపట్టాలేసుకుని తిరిగారంటూ ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కథనం రాసింది.
ఈ కథనం వైరల్ అయింది. దీంతో కుశాల్ టాండన్‌కు చిర్రెత్తుకొచ్చింది. సదరు వెబ్‌సైట్‌తో పాటు జర్నలిజంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు. సుశాంత్ , అంకితతో తన సంబంధాలపై క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు కుశాల్ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌లో కుశాల్ ఏమన్నాడో తెలుసుకుందాం.
‘ప్చ్… ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఇదేనా జర్నలిజం అంటే? సుశాంత్, అంకితలకు నేను మంచి స్నేహితుడిని. సుశాంత్ నాకు సోదరుడిలాంటివాడు. అంకిత నాకు మంచి స్నేహితురాలు. దయచేసి మీ బ్లేమ్ గేమ్‌లో నన్ను చేర్చకండి. ఇలాంటి వార్తా ప్రపంచంలో ఉన్నందుకు షాక్ అవుతున్నాను’ అంటూ కుశాల్ గరం గరం అయ్యాడు. మొత్తానికి ఓ వెబ్‌సైట్‌లో రాసిన డేటింగ్ కథనంతో కుశాల్ బాగా ఇరిటేట్ అయినట్టు…అతని ట్వీట్ చూస్తే తెలుస్తుంది.