Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలీవుడ్ హీరోని కొట్టిన న‌టి

బాలీవుడ్ హీరోని కొట్టిన న‌టి

కొట్టుకోవ‌డంలో కూడా చాలా ర‌కాలుంటాయి. చిలిపిగా, స‌ర‌దాగా, సీరియ‌స్‌గా, ప్రేమ‌గా ...ఇలా వాళ్ల మ‌ధ్య సంబంధాల‌ను బ‌ట్టి కొట్టుకోవ‌డాలు, తిట్టుకోవడాలు ఉంటాయి. సీరియ‌స్‌గా కొట్టుకోవ‌డం అంటే అవి వేర్వేరు కార‌ణాలై ఉంటాయి. సినీతార‌ల మ‌ధ్య కూడా కొట్టుకోవ‌డాలు, తిట్టుకోవ‌డాలు బాగానే ఉంటాయి. అయితే అవ్వ‌న్నీ సీరియ‌స్‌గా జ‌రిగేవ‌ని ఎవ‌రైనా అనుకుంటే పొర‌ప‌డి న‌ట్టే. 

బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ త‌న‌ను ఓ న‌టి కొట్టింద‌ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. అది నిమిషాల్లో వైర‌ల్ అయింది. దాని క‌థా క‌మామీషూ ఏంటో తెలుసుకుందాం.

కియారా అద్వానీ త‌న ముక్కు మీద ఉద్దేశ పూర్వ‌కంగానే కొట్టింద‌ని బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగా ఏబీసీడీ 2 సినిమాలోని స‌న్ సాతియా సాంగ్‌ రిహార్స‌ల్‌లో  ఇది జ‌రిగింద‌ని చెబుతూ వీడియోని సాక్షిగా చూపుతూ పోస్ట్ చేశాడు.  

వీడియోలో వ‌రుణ్ ధావ‌న్, కియారా అద్వానీలు పాట‌కు అనుగుణంగా నాన్‌స్టాప్ డ్యాన్స్ చేశారు. ఓ సంద‌ర్భంలో కియారా.. వ‌రుణ్‌ని ముక్కుపై కొట్టింది.  ఒరిజిన‌ల్ సాంగ్‌లో వరుణ్ ధావ‌న్, శ్ర‌ద్ధా క‌పూర్ క‌లిసి డ్యాన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

కాగా కియారా అద్వానీ తెలుగు సినిమాల్లో కూడా న‌టించారు. భ‌రత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యారు. అందులో వ‌సుమ‌తి పాత్ర‌లో న‌టించారు. అలాగే విన‌య విధేయ‌రాలు సినిమాలో కూడా ఆమె న‌టించారు. లాక్‌డౌన్ వేళ‌లో స‌ర‌దా పోస్టుల‌తో సినీ సెలిబ్రిటీలు వినోదం పంచుతున్నారు. 

జ‌గ‌న్ ముందు మ‌రోసారి కేసీఆర్ కూడా చిన్న‌బోతున్నారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?