బోయపాటి సినిమా బిజినెస్ క్లోజ్

బోయపాటి-బాలయ్య సినిమా విడుదల డేట్ ప్రకటించేసిన సంగతి తెలిసిందే. మే 28న సినిమా విడుదల అవుతుందని తెలిసిన తరువాత ఈ సినిమా బిజినెస్ ఊపందుకోవడం విశేషం. Advertisement ఆ కాంబినేషన్ మీద వున్న నమ్మకమో,…

బోయపాటి-బాలయ్య సినిమా విడుదల డేట్ ప్రకటించేసిన సంగతి తెలిసిందే. మే 28న సినిమా విడుదల అవుతుందని తెలిసిన తరువాత ఈ సినిమా బిజినెస్ ఊపందుకోవడం విశేషం.

ఆ కాంబినేషన్ మీద వున్న నమ్మకమో, నందమూరి ఫ్యామిలీ మీద వున్న వీరాభిమానమో కానీ మాంచి ఫ్యాన్సీ రేట్లకు ఈ సినిమా బిజినెస్ క్లోజ్ కావడం కాస్త ఆశ్చర్యంగానే వుంది.

ఓన్లీ ఆంధ్ర ఏరియాను 35 కోట్ల రేషియోలో బిజినెస్ చేయడం నిజంగా విశేషమే అనుకోవాలి. ఆ లెక్కల్లోనే నైజాం, సీడెడ్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ ది సడెన్ గా బిబి 3 సినిమా గురించి ఇండస్ట్రీ సర్కిళ్లలో డిస్కషన్ పెరిగింది.

ఈ సినిమా అనంతపురం బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. సినిమాలో కాషాయం కట్టిన అఘోరాగా బాలయ్య కనిపిస్తారు. ప్రజల కోసం పాటు పడే జమీందారు కుటుంబీకుడిగా మరో పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారు. 

బాలకృష్ణ గతంలో సినిమాల మాదిరిగా హీరోయిన్లతో అల్లరి గెంతులు వగైరా వ్యవహారాలు ఈ సినిమాలో వుండవని, అంతా క్లాస్ గా డిగ్నిఫైడ్ గా వుంటుందని తెలుస్తోంది. 

తెలంగాణలో పార్టీ వద్దని జగన్‌ సూచన

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా